Dubai Gold Dress: గోల్డ్ రేటు ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ఒక గ్రాము బంగారం కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఇండియాలో ఉంది. కానీ దుబాయిలో మాత్రం గోల్డ్ తోనే ఓ డ్రెస్సును రూపొందించారు. సౌదీ అరేబీయాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ.. అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యూలరీ ఈ డ్రెస్సును డిజైన్ చేసింది.
ఈ డ్రస్సు బరువు 10 కిలోల 81 మిల్లీ గ్రాములు. ఈ డ్రెస్సులో కిరీటం, భారీ నక్లెస్, చెవిపోగులు, నడుపు అలంకరణ వంటి నాలుగు ప్రధాన భాగాలు ఉన్నాయి. దీని విలువ దాదాపు 4.6 మిలియన్ థామ్‌లు అంటే.. ఇండియన్స్ కరెన్సీలో రూ. 10 నుండి రూ.11 కోట్లు అనమాట. ఈ దుబాయి డ్రెస్సును షార్‌జాలో జరిగిన 56వ మిడిల్ మిడిల్ ఈస్ట్ షోలో ప్రదర్శించారు.
కిరీటం తయారీకి 398 గ్రాములు, 8,810 గ్రాముల బరువుతో నెక్లెస్, నడుము అలంకరణకు 738.5 గ్రాముల బంగారం. చెవిపోగులకు 134.1 గ్రాముల బంగారం వాడారు. దీన్ని రూపొందించడానికి డిజైనర్లు 90 గంటలపాటు కష్టపడ్డారట. గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందడంతో లభించే అంతర్జాతీయ ప్రచారం.. దాని తయారు ఖర్చు కంటే చాలా ఎక్కువ విలువైనదిగా పరిగణించవచ్చు
ఇది కంపెనీ బ్రాండు, ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది. UAE సంస్కృతిలో, మిడిల్ ఈస్ట్‌లో బంగారం తరతరాలుగా, సంపదకు, ప్రతిష్టతకు, సాంప్రదాయానికి చిహ్నంగా ఉంటుంది. ఈ దుస్తులను దుబాయి డ్రెస్సు అని పిలవడం వల్ల.. స్థానిక సంస్కృతికి గౌరవం ఇవ్వడంతో పాటు.. ప్రపంచ స్థాయి విలాసవంతమైన వస్తువుగా దీన్ని ఉంచడం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. బంగారం డ్రెస్సు తయారుచేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు అందుకుంది ఆల్ రొమైజాన్ సంస్థ.
రూ.9.5 కోట్ల డ్రెస్.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు డ్రెస్ ను తయారు చేసిన సౌదీ అరేబియాకు చెందిన అల్ రోమైజాన్ గోల్డ్ అనే సంస్థ
10.5 కిలోల బరువుతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో నాలుగు భాగాలుగా డ్రెస్ తయారీ
బంగారు వస్త్రంలో పొదిగిన… pic.twitter.com/gn0hvPYf1T
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2025