E-Paper
Advertisement

Influencer Shot Dead: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను కాల్చి చంపిన పోలీసులు.. ఎందుకంటే?

Influencer Shot Dead: ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను కాల్చి చంపిన పోలీసులు.. ఎందుకంటే?
Advertisement

మైఖేల్ డువార్టే. అమెరికాలో ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఫుడ్‌ విత్‌ బేర్‌ హ్యాండ్స్’ పేరుతో బాగా పాపులర్ అయ్యాడు. తాజాగా అతడు ఓ పోలీసు అధికారిని కత్తితో బెదిరించి, దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అతడిని టెక్సాస్ పోలీసులు కాల్చి చంపారు. మదీనా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన నవంబర్ 8న టెక్సాస్‌లోని కాస్ట్రోవిల్లెలో జరిగింది. “ఓ వ్యక్తి కత్తి పట్టుకుని అందరినీ బెదిరిస్తున్నాడని ఎమర్జెన్సీ లైన్ కు కాల్ వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడిని కత్తిని కింద పడేసి నేలమీద పడుకోవాలని ఆదేశించారు. కానీ, అతడు పట్టించుకోలేదు. ’నేను నిన్ను చంపబోతున్నాను” అంటూ పోలీసు అధికారిపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. రక్తపు మడుగులో పడిపోయిన అతడిని వెంటనే అతడిని శాన్ ఆంటోనియోలోని యూనివర్శిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు” అని మదీనా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకటించింది.

ఎవరీ డువార్టే.. ఎందుకు అలా ప్రవర్తించాడు?

కాలిఫోర్నియాకు చెందిన డువార్టే.. బార్బెక్యూ, గ్రిల్లింగ్ వీడియోతో నెటిజన్లు బాగా ఆకట్టుకునేవాడు. అతడికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింది. అయితే, గత కొంత కాలంగా అతడు మానసిక సమస్యలో బాధపడుతున్నట్లు సన్నిహితులు వెల్లడించారు. అటు డువార్టే మృతిని.. టాలెంట్ ఏజెన్సీ అలూమా మీడియా గ్రూప్ ధృవీకరించింది. ఆ సంస్థ ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలిపింది. అతడిని అంకితభావంతో ఉన్న భర్త, ప్రేమగల తండ్రి, నమ్మకమైన స్నేహితుడి అభివర్ణించింది. “మాకు ఎంతో ముఖ్యమైన క్లయింట్, ప్రియమైన స్నేహితుడు మైఖేల్ డువార్టే మరణం పట్ల మేం చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆలూమాలో మాకు మైఖేల్ కేవలం ఒక క్లయింట్ మాత్రమే కాదు. అంత కంటే ఎక్కువ. ఆయన నిజమైన, నమ్మకమైన భాగస్వామి కూడా.  అన్నింటి కంటే ముఖ్యంగా అద్భుతమైన వ్యక్తి. ఆయన అభిరుచి, వృత్తి నైపుణ్యం, సృజనాత్మకత మా సంస్థ మీద శాశ్వత ముద్ర వేసింది” అని కంపెనీ తెలిపింది.

Advertisement

Read Also: ఆఫీసులోనే ఆ పనులు కానిచ్చేస్తున్న ఇండియన్స్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్!

డువార్టే అంత్య క్రియలకు క్రౌండ్ ఫండింగ్

డువార్టే అంత్యక్రియల ఖర్చులకు, ఆయన కుటుంబాన్ని ఆదుకోవడానికి గో ఫండ్‌ మీలో స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. దాతలు ఇచ్చిన విరాళాలతో అతడిని కాలిఫోర్నియాకు తీసుకురావడానికి, ఆయన భార్య జెస్సికా, అతడి 6 ఏళ్ల కుమార్తె ఓక్లీకి సపోర్టు చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయనకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూళు అయ్యాయి. ఇంకా దాతలు విరాళాలు ఇస్తూనే ఉన్నారు.

Advertisement

Read Also:  వాగు దాటలేక గ్రామస్తులు అవస్థలు.. ఏకంగా వంతెన కట్టేసిన యూట్యూబర్, మన రాష్ట్రంలోనే!

Related News

అయ్యబాబోయ్.. ‘సైకిల్ అంబులెన్స్’ అంట.. నెట్టింట మళ్లీ జోకర్ అయిన పాక్!

పెరులో వరుస భూకంపాలు.. ఆరుగురు మృతి, వందలాది మంది నిరాశ్రయులు

అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు.. ఇద్దరు అమెరికా సైనికులు మృతి, ట్రంప్‌పై ఖమేని ఘాటు వ్యాఖ్యలు

హార్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. సముద్రంలో పేలిన రెండు చమురు ట్యాంకర్లు!

మెక్సికోలో భారీ భూకంపం.. ఒక్కసారిగా ఊగిపోయిన భవనాలు! సునామీ ముప్పు పొంచి ఉందా?

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

ఇరాన్‌పై అమెరికా దాడులు.. కుప్పకూలిన చాబహార్ టవర్.. భారత్‌కు కోలుకోలేని దెబ్బ!

అల్జీరియాలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది అనాథలు సజీవదహనం, 19 మందికి తీవ్ర గాయాలు

Big Stories

Advertisement
×