E-Paper
Advertisement

Viral Video: వాగు దాటలేక గ్రామస్తులు అవస్థలు.. ఏకంగా వంతెన కట్టేసిన యూట్యూబర్, మన రాష్ట్రంలోనే!

Viral Video: వాగు దాటలేక గ్రామస్తులు అవస్థలు.. ఏకంగా వంతెన కట్టేసిన యూట్యూబర్, మన రాష్ట్రంలోనే!
Advertisement

సమాజంలో ఎంతో మంది దగ్గర డబ్బులు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. కానీ, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచన ఏ కోశాన ఉండదు. మారుమూల ప్రాంతాల నుంచి నగరాలకు వెళ్లే పలు రంగాల్లో రాణించిన వారు ఉంటారు. ఆర్థికంగా బలపడుతారు కూడా. పుట్టి పెరిగిన ఊరుకు ఏదో ఒక మేలు చేయాలనే ఆలోచన ఉండదు. ఎంత డబ్బు ఉన్నా, తోటి వారికి సాయం చేయాలంటే మంచి గుణం ఉండాలి. తాజాగా అలాంటి గొప్ప మనుసు చాటుకున్నాడు ఓ యూట్యూబర్. తన సొంత డబ్బులతో ఓ గ్రామానికి వంతెన నిర్మించాడు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు పడుతున్న కష్టాలకు పరిష్కారం చూపించాడు. అతడు చేసిన పనికి అందరూ అభినందనలు కురిపిస్తున్నారు.

కాలువ దాటి వెళ్లలేక గ్రామస్తుల అవస్థలు

విజయనగరం జిల్లాలో మూల బొడ్డవర గ్రామ పంచాయతీ పరిధిలో గాదెల్లోవ అనే మారుమూల గ్రామం ఉంటుంది. ఈ ఊరి ప్రజలు బయటకు రావాలంటే ఓ కాలువను దాటాల్సి ఉంటుంది. ఏడాదిలో 10 నెలలకు పైగా అందులో నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఆ నీళ్లలో నుంచి వెళ్లడానికి ప్రజలకు ఎన్నో అవస్థలు పడే వారు. వర్షాలు వచ్చే సమయంలో కాలువ ప్రవాహం ఎక్కువగా ఉండేది. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయేవి. ప్రవాహం తీవ్రత తగ్గినా కాలువ దాటి వెళ్లడం కష్టంగా ఉండేది. ఈ కాలువ మీద చిన్న వంతెన నిర్మించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు గ్రామాస్తులు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. గ్రామస్తులే ఆ కాలువ మీద ఓ విద్యత్ స్తంభాన్ని అడ్డంగా వేసి, రాకపోకలు కొనసాగించేవారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలకు, ప్రతి రోజూ స్కూలుకు వెళ్లేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడే వారు. కానీ, తాజాగా తుఫాన్ కారణంగా కాలువ మీద వేసిన స్తంభం కూడా కొట్టుకుపోయింది. గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు స్కూలుకు వెళ్లడం మానేశారు.

సొంత ఖర్చుతో వంతెన నిర్మించిన యూట్యూబర్

Advertisement

తమ బాధలను చెప్తూ గ్రామస్తులో సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఈ వీడియోను శృంగవరపుకోటకు చెందిన యూట్యూబర్ రామ్ సింగ్ నవీన్ చూశాడు. వారికి సాయం చేయాలనుకున్నాడు. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న నవీన్.. తన సొంత డబ్బులతో కాలువ మీద వంతెన నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు. తనతో పాటు కొంతమంది మిత్రుల సాయం తీసుకున్నాడు. అతడికి గ్రామస్తులు కూడా తోడుగా నిలిచారు. కొద్ది రోజుల్లోనూ మూడు అడుగుల వెడల్పుతో కాలువ మీద వంతెన నిర్మించాడు. తాజాగా దానిని ఓపెన్ చేశాడు. గ్రామ ప్రజలు ఎంతో కాలంగా పడుతున్న కష్టాలను తీర్చాడు. నవీన్ చేసిన పనికి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్తున్నారు. నవీవ్ నిర్మించిన వంతెనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మిగతా యూట్యూబర్లు కూడా ఇలాంటి గ్రామాలకు తమకు తోచిన సాయం చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

Read Also: జస్ట్, ఇంట్లో ఉండి ఏడాదికి రూ.60 లక్షలు సంపాదిస్తున్న మహిళ, ఈమె తెలివికి జోహార్లు!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×