E-Paper
Advertisement

Delhi Air Pollution: డేంజర్ సిచ్యువేషన్.. మాస్కులు కూడా సరిపోవు, ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆందోళన

Delhi Air Pollution: డేంజర్ సిచ్యువేషన్.. మాస్కులు కూడా సరిపోవు, ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆందోళన
Advertisement

Delhi air pollution: దేశ రాజధాని నగరం ఢిల్లీని చుట్టుముట్టిన ప్రమాదకర వాయు కాలుష్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తూ.. అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడాన్ని ధర్మాసనం ‘చాలా తీవ్రమైన పరిస్థితి’ గా అభివర్ణించింది. ఈ కాలుష్య తీవ్రతకు కనీసం మాస్కులు కూడా సరిపోవని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

డేంజర్ కేటగిరిలో ఏక్యూఐ..

Advertisement

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (Air Quality Index – AQI) 400కిపైనే నమోదవుతూ డేంజర్ (తీవ్ర) కేటగిరీలో కొనసాగుతోంది. ఈ విషపూరితమైన గాలి కారణంగా రాజధాని వాసులు శ్వాసకోశ సమస్యలతో సహా పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నేరుగా విచారణకు బదులుగా వర్చువల్ (Virtual)- వీడియో కాన్ఫరెన్స్ విచారణలకు హాజరుకావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూచించారు.

సిచ్యువేషన్ వెరీ డేంజర్..

Advertisement

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో.. దీని తీవ్రతపై సుప్రీంకోర్టు తన ఆందోళనను గట్టిగా వినిపించింది. వాయు కాలుష్య పరిస్థితిని ‘చాలా తీవ్రమైనది’ గా ధర్మాసనం అభివర్ణించింది. ఈరోజు జరిగిన విచారణ సందర్భంగా.. అత్యంత కలుషితమైన గాలిని దృష్టిలో ఉంచుకుని కోర్టుకు నేరుగా హాజరవుతున్న సీనియర్ న్యాయవాదులను న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ ప్రశ్నించారు.

ఇక అంతా వర్చువల్ గానే..

‘ఈ పరిస్థితి చాలా, చాలా తీవ్రమైనది! మీరంతా ఇక్కడ ఎందుకు హాజరవుతున్నారు? మనకు వర్చువల్ విధానంలో విచారణ సదుపాయం ఉంది. దయచేసి దానిని వినియోగించుకోండి. ఈ కాలుష్యం శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది’ అని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు.అనంతరం.. కోర్టులో ఉన్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ.. చాలా మంది న్యాయవాదులు ఇప్పటికే మాస్కులు ధరించి ఉన్నారని తెలిపారు. దీనికి జస్టిస్ నరసింహ బదులిస్తూ..‘మాస్కులు కూడా సరిపోవు. మేము ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తితో కూడా చర్చిస్తాం’ అని అన్నారు. కాలుష్య తీవ్రత ప్రజల ఆరోగ్యాన్ని శాశ్వతంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని న్యాయమూర్తి హెచ్చరించారు.

క్షీణించిన గాలి నాణ్యత..

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) నివేదికల ప్రకారం.. రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400కిపైగా నమోదవుతూ ‘తీవ్ర’ (Severe) కేటగిరీలో కొనసాగుతోంది. ఈ తీవ్రమైన గాలి ఆరోగ్యవంతులపై కూడా ప్రభావం చూపి, ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. కాలుష్య కారకాల్లో ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనం (Stubble Burning) ప్రధాన కారణంగా ఉందని అధికారులు గుర్తించారు. ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) III దశ ఆంక్షలను అమలులోకి తెచ్చినప్పటికీ.. పరిస్థితి మెరుగుపడటం లేదు.

ఆ రెండు రాష్ట్రాలకు కోర్టు ఆదేశాలు..

ఢిల్లీ కాలుష్యంపై విచారణ జరుపుతున్న మరో ధర్మాసనం (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బి.ఆర్. గవాయి, జస్టిస్ కె. వినోద్ చంద్రన్) బుధవారం (నవంబర్ 12) నాడు పంజాబ్, హర్యానా ప్రభుత్వాల నుంచి కీలక నివేదికలను కోరింది. పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఈ రెండు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యం నివారణ కోసం అమలు చేస్తున్న చర్యలకు సంబంధించిన ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం నొక్కి చెప్పింది. మొత్తంగా, ఢిల్లీలో నెలకొన్న ఈ వాయు కాలుష్య సంక్షోభం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండగా.. దీనిని నియంత్రించేందుకు తక్షణ, కఠినమైన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాలను, న్యాయవాదులను హెచ్చరించింది.

ALSO READ: Akkineni Nagarjuna: కొండా సురేఖ క్షమాపణ.. నాగార్జున సంచలన నిర్ణయం

Related News

మెట్లపై నుంచి జారిపడి చనిపోయిన గ్లోబల్ టెర్రరిస్ట్

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×