E-Paper
Advertisement

Iran vs America-Israel War: ఇరాన్‌పై యుద్ధం తీవ్రం.. అమెరికా ఆమోదం, ఇజ్రాయెల్‌కు 12 వేల బాంబులు

Iran vs America-Israel War: ఇరాన్‌పై యుద్ధం తీవ్రం.. అమెరికా ఆమోదం, ఇజ్రాయెల్‌కు 12 వేల బాంబులు
Advertisement

Iran vs America-Israel War: మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మరో అడుగు ముందుకేసింది. ఇజ్రాయెల్‌కు 12 వేల ఎయిర్‌డ్రాప్డ్ బాంబులను విక్రయించనుంది. ఈ మేరకు అమెరికా ఆమోదం తెలిపింది. దాని విలువ సుమారు 151.8 మిలియన్ల యూఎస్ డాలర్లు. ఈ ఒప్పందంలో ఆధునిక యుద్ధ విమానాలు ఉపయోగించే వెయ్యి పౌండ్ల ప్రెసిషన్-గైడెడ్ మందుగుండు బదిలీ కూడా ఉండనుంది.

ఇరాన్‌పై యుద్ధాన్ని తీవ్రతరం చేసిన అమెరికా

Advertisement

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ముదిరింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదముద్ర వేసింది. అత్యవసర మినహాయింపు ద్వారా ఇజ్రాయెల్‌కు 12,000 బాంబులు విక్రయించ నుంది. మార్కట్లో దీని విలువ అక్షరాలా సుమారు 151.8 మిలియన్ల యూఎస్ డాలర్లు. దీన్ని ఆ దేశ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమర్ధించుకున్నారు.

దీనిపై అమెరికా కాంగ్రెస్‌లో ఎలాంటి సమీక్ష లేకుండా డీల్ ముందుకు సాగడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించింది. ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించిన అత్యవసర జాతీయ భద్రతా పరిగణనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఆయుధాల ఎగుమతి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 36(b)ను మినహాయించినట్టు గుర్తు చేశారు.

Advertisement

ఈ ప్రతిపాదిన ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపింది. రక్షణను బలోపేతం చేస్తుందని స్టేట్ డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. నార్మల్ గా ఇలాంటి అమ్మకాలకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి ఈ విక్రయాన్ని వేగవంతం చేసింది.

ఇజ్రాయెల్‌కు 12 వేల బాంబులు ఇచ్చేందుకు అమెరికా ఆమోదం

BLU-110 అనేది జాయింట్ డైరెక్ట్ అటాక్ మునిషన్ సిస్టమ్. దీని కింద F-15, F-16, F-35 వంటి విమానాలు తీసుకెళ్లవచ్చు. సాధారణంగా అణు నిర్మాణాలు, సైనిక సౌకర్యాలు, మౌలిక సదుపాయాల లక్ష్యాలను ఛేదించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇజ్రాయెల్ కోసం ఆమోదించబడిన ఈ డీల్‌లో బాంబులు మాత్రమే కాదు.

అమెరికా కాంట్రాక్టర్ల నుండి సాంకేతిక సహాయం, ఇంజనీరింగ్ మద్దతు, లాజిస్టిక్స్ సేవలు ఉన్నాయని అమెరికా రక్షణ అధికారులు తెలిపారు. వాషింగ్టన్ చాలాకాలంగా ఇజ్రాయెల్‌కు అధునాతన సైనిక పరికరాలకు సరఫరాదారుగా ఉంది. అమెరికా చట్టం ప్రకారం, జాతీయ భద్రత లేదా ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేసే అంశాలున్న పరిస్థితులలో సన్నిహిత మిత్రదేశాలకు ఆయుధ బదిలీలను వేగవంతం చేయవచ్చు.

ALSO READ: ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్.. మూల్యం తప్పదని ఘాటు హెచ్చరిక

ఈ అమ్మకం రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక రక్షణ సంబంధం, వార్ సమయంలో ఇజ్రాయెల్ సైనిక అవసరాలకు మద్దతు ఇవ్వడంలో వాషింగ్టన్ నిబద్ధతను ప్రతిబింబించింది. అమెరికా ప్రకటన నిరంతర ఆయుధ బదిలీలు సంఘర్షణను పొడిగించే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు విమర్శిస్తున్నారు.

ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్‌కు ఈ ఆయుధాలు అవసరమని మరికొందరు అంటున్నారు. ఇటీవల అమెరికా రక్షణ సంస్థలతో అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచడానికి వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్తావించారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×