BigTV English

US Mass Shooting : 18 మందిని చంపిన సైకో మృతి.. ఎలా జరిగిందంటే?

US Mass Shooting : అమెరికాలోని మైనే రాష్ట్రంలోని లెవిస్ టన్ నగరంలో బుధవారం ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నగాయపడిన వారి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలిసింది

US Mass Shooting : 18 మందిని చంపిన సైకో మృతి.. ఎలా జరిగిందంటే?

US Mass Shooting : అమెరికాలోని మైనే రాష్ట్రంలోని లెవిస్ టన్ నగరంలో బుధవారం ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటనలో 18మంది ప్రాణాలు కోల్పోగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నగాయపడిన వారి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు తెలిసింది.


అయితే కాల్పులు జరిపిన దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం రెండు రోజుల నుంచి గాలిస్తుండగా.. శుక్రవారం రాత్రి అతడి మృతదేహం లభించింది.

కాల్పుల ఘటన తరువాత కౌంటీ పోలీసులు ఫేస్ బుక్ పేజీలో నిందితుడి రెండు ఫొటోలను విడుదల చేశారు. ఫొటోలో పొడవాటి చేతుల చొక్కా, జీన్స్ ధరించిన, గడ్డం ఉన్నవ్యక్తి కాల్పులు జరుపుతున్నట్లు ఉంది. కాల్పులకు కారణమైన ఆ వ్యక్తి గురించి ఆరా తీయగా అతని పేరు రాబర్ట్ కార్డ్(40) పోలీసులు తెలిసింది.


రాబర్ట్ కార్డ్ అమెరికా ఆర్మీ రిజర్వ్ లో ఆయుధాల ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే గత కొంతకాలంగా అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. శక్రవారం రాత్రి ఒక చెత్త వేసే ప్రదేశంలో రాబర్ట్ మృతదేహం లభించిందని అధికార మీడియా వెల్లడించింది.

రాబర్ట్ లాంటి సైకో చనిపోయాడనే వార్త వినగానే తనకు ప్రశాంతంగా ఉందని మైనే రాష్ట్ర గవర్నర్ జానెట్ మిల్స్ తెలిపారు. దేశ అధ్యక్షుడు జో బైడెన్ కూడా అమెరికాలో ఈ గన్ వైలెన్స్ సంస్కృతి అంతం చేసేందుకు కృషిచేస్తానని తెలిపారు.

Related News

Visakha RK Beach: బీచ్‌లో విషాదం.. గల్లంతైన ముగ్గురు వ్యక్తులు, ఒక్కరు మృతి

Telangana crime: పదేళ్ల పోరాటం ఫలితం.. ఆ కీచకుడికి ఉరి శిక్ష.. సంచలన తీర్పునిచ్చిన పోక్సో కోర్టు!

UP News: రాఖీ కట్టించుకుని మరీ బాలికపై అఘాయిత్యం.. ఆ తర్వాత ఫ్యాన్‌కు వేలాడ దీసి..?

Bengaluru Crime: వారిద్దరూ 30 ఏళ్లుగా ప్రాణ స్నేహితులు.. పదేళ్లుగా ఫ్రెండ్ భార్యతో ఎఫైర్, చివరికి ప్రాణం తీశారు!

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Big Stories

×