Breaking news: తమిళనాడు రాష్ట్రంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కరూర్ లో సినీ హీరో, టీవీకే పార్టీ చీఫ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 40 మంది మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలు అయినట్టు తెలుస్తోంది. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రేపు బాధితులను సీఎం పరామర్శించనున్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ రియాక్ట్ అయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
🔴#BREAKING | கரூர் விஜயின் பிரச்சாரத்தின் போது ஏற்பட்ட கூட்ட நெரிசலில் சிக்கி 13 பேர் உயிரிழந்த நிலையில்
🔹சேலம், திருச்சி , நாமக்கல் உள்ளிட்ட அரசு மருத்துவமனைகளிலிருந்து மூத்த மருத்துவர்கள் மற்றும் மயக்கவியல் மருத்துவர்கள் கரூர் செல்லுமாறு முதலமைச்சர் அறிவுறுத்தல்
🔹கரூர்… pic.twitter.com/fp3uEjuZc6
— Spark Media (@SparkMedia_TN) September 27, 2025