BigTV English

Suryakantam : ఒక వెలుగు వెలిగిన సూర్యకాంతం.. పాపం లాస్ట్ స్టేజ్ లో అలా అయ్యిందా..?

Suryakantam :  ఒక వెలుగు వెలిగిన సూర్యకాంతం.. పాపం లాస్ట్ స్టేజ్ లో అలా అయ్యిందా..?
Suryakantam

Suryakantam : గయ్యాళి అత్తగా.. గడసరి తోడి కోడలిగా తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన నటి సూర్య కాంతం. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రేక్షకులలో కూడా సూర్యకాంతం పేరు చెబితే హడలిపోయేవారట. సినిమాలో సూర్యకాంతం చేసే ఆగిత్యం చూసి.. ఆడపిల్లలకు ఆ పేరు పెట్టాలంటేనే భయపడి పోయేవారు. గొప్ప నటిగా ఓ దశలో ఒక వెలుగు వెలిగిన నటి ఆఖరి క్షణాల్లో.. హాస్పిటల్ లో ఉంటే పరామర్శించడానికి కూడా అప్పటి ఇండస్ట్రీ పెద్దలు వెళ్లలేదట.


చేసేది గయ్యాళి పాత్రలు అయినప్పటికీ వెన్నలాంటి మనసు ఉన్న ఆమెను.. కష్టకాలంలో ఎవరు పట్టించుకోలేదని ఇప్పటికీ చెబుతారు. తెరపై కనిపించే సూర్యకాంతానికి తెర వెనక సూర్యకాంతానికి ఎంతో వ్యత్యాసం ఉండేదట. అందరితో ఎంతో కలుపుగోలుతనంగా ఉండే సూర్య కాంతం చివరి క్షణాల్లో ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోకపోవడం ఇప్పటికి చాలా బాధాకరమైన విషయమే.

సూర్యకాంతం మంచి నటే కాదు.. బ్రహ్మాండంగా వంటలు చేసేదట. షూటింగ్ సమయంలో అందరి కోసం ఇంటి నుంచి భోజనం వండి తెచ్చి కడుపునిండా పెట్టేదట. సూర్యకాంతం ఆఖరిగా నటించిన చిత్రం చిరంజీవి హీరోగా వచ్చిన ఎస్పీ పరశురామ్. ఆ తర్వాత నటించాలి అన్న ఆశ ఉన్నప్పటికీ డయాబెటిస్ కారణంగా షూటింగ్ కి రాలేక ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆసుపత్రి పాలయ్యారు.


ఆసుపత్రిలో ఉండగా ఎవరూ పట్టించుకోలేదు సరే.. కన్నుమూసిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని చూసేందుకు కూడా కొందరు ప్రముఖులు వెళ్లలేదని ఇప్పటికీ ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో చాలా గొప్పగా వెలిగిన ఒక నటీమణికి ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో అంత్యక్రియలు జరిగాయి. పాత సినిమాలు ఎన్నో రీమేక్ అయినప్పటికీ గుండమ్మ కథ మాత్రం ఇప్పటికీ రీమేక్ చేయడానికి ఎవరికీ సాహసం లేదు. ఆ సినిమాలో మిగిలిన నటులను రీప్లేస్ చేసే నటులు ఉండొచ్చు కానీ ఒక్క గుండమ్మ పాత్ర ను సూర్యకాంతం తప్ప చేయగలిగే వారు ఎవరూ లేకపోవడమే దీనికి ముఖ్య కారణం. సూర్యకాంతం నటన అంటే అలా ఉంటుంది మరి.. తెలుగు చిత్ర పరిశ్రమలో సూర్యకాంతం.. ఒక యూనిక్ .

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×