Intelligence Bureau: నిరుద్యోగులకు ఇది భారీ శుభవార్త. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్ పాసైన వారికి ఇది మంచి అవకాశం. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.1,42,400 వరకు జీతం అందజేస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు తదితర వివరాల గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత ప్రభుత్వం, హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ II/ టెక్ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 25 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 258
ఇంటలిజెన్స్ బ్యూరోలో 258 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ II/ టెక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
వివిధ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీలో 90 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 168 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ పాసై ఉండాలి. దీంతో పాటు 2023, 2024, 2025 గేట్ స్కోర్ ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు సెప్టెంబర్ 28 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం అందజేస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ పురుషులకు రూ.200 ఫీజు ఉంటుంది. ఇతరులకు రూ.100 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.mha.gov.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 258
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 11