Dhanya Balakrishna: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలి అంటే కొన్ని సార్లు మనం గీసుకున్న బోర్డర్స్ దాటి నటించాల్సి ఉంటుంది. సన్నివేశాన్ని బట్టి పాత్రను బట్టి కొన్నిసార్లు రొమాంటిక్ సన్నివేశాలు ,ఎక్స్పోజింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి చేస్తేనే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంటారని ఎంతో మంది సెలెబ్రెటీలు వెల్లడించారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఇలాంటి వాటికి దూరంగా ఉన్న నేపథ్యంలో సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇలాంటి వారిలో నటి ధన్య బాలకృష్ణ (Dhanya Balakrishna)కూడా ఒకరు.
ధన్య బాలకృష్ణ త్వరలోనే కృష్ణ లీల(Krishna Leela)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దేవన్(Devan) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దేవన్ ధన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ మంచిగా ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఈ ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ నుంచి ధన్య బాలకృష్ణకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీకు ఇండస్ట్రీలో ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి ఇతరులతో పోల్చుకుంటే మీరు ఇంకా వెనుకబడి ఉన్నారు అనే భావన ఎప్పుడైనా కలిగిందా అంటూ ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు ధన్య సమాధానం చెబుతూ.. కెరియర్ మొదట్లో నాకు కూడా ఇతరులతో పోలికలు ఉండేవని వారందరూ సక్సెస్ అవుతున్నారు నేను కాలేకపోతున్నానని భావన ఉండేదని తెలిపారు. కానీ ప్రస్తుతం అలాంటి ఆలోచనలు కూడా లేవని తెలిపారు. నేను ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాను వాటి కారణంగానే ఇతరులతో పాటు ముందుకు వెళ్లలేకపోతున్నానని ఈమె వెల్లడించారు. తాను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయిని అని తెలిపారు .
ప్రేమ, కర్మ నేపథ్యంలో..
తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొన్ని గ్లామరస్ పాత్రలలో నటించే అవకాశాలు వచ్చాయి. అలాగే టూ మచ్ రొమాంటిక్ సన్నివేశాలలో నటించే సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఇలాంటి వాటిని నేను రిజెక్ట్ చేయడం వల్లే పెద్దగా సక్సెస్ కాలేకపోయాను కానీ ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించి సినిమాలు అంటే ఇష్టం లేని నా తల్లిదండ్రులను ఒప్పించి, వారితో ఫైట్ చేసి ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయికి వచ్చాను. నా దృష్టిలో ఇదే పెద్ద సక్సెస్ అంటూ ధన్య బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక కృష్ణ లీల సినిమా విషయానికి వస్తే..రీబర్త్, ప్రేమ, కర్మ అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత జన్మలో ఓడిపోయిన ప్రేమను ప్రస్తుత జన్మలో తిరిగి సాధించాలనుకునే ప్రేమికుడి కథగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మంచి అంచనాలను పెంచేస్తోంది.
Also Read: Ramya Krishnan: రమ్యకృష్ణ పై ఐరన్ లెగ్ ట్రోల్స్.. ఆ జ్యోతిష్యుడు మాటే నిజమైందా?