E-Paper
Advertisement

AP TET 2025: ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ.. సిలబస్, పరీక్ష విధానం ఇలా

AP TET 2025: ఏపీ టెట్ ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ.. సిలబస్, పరీక్ష విధానం ఇలా
Advertisement

AP TET Apply Syllabus: ఏపీ టెట్-2025 అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 24, 2025న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు  https://tet2dsc.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. డీఎస్సీ పరీక్షలు రాసేందుకు టెట్ అర్హతగా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ లో అర్హత సాధించాల్సి ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23, 2025 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. టెట్ పరీక్షను డిసెంబర్ 10న నిర్వహించనున్నారు.

  • టెట్ నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 24
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం – అక్టోబర్ 24
  • దరఖాస్తుకు చివరి తేదీ – నవంబర్ 23
  • దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు – అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23
  • ఆన్‌లైన్ మాక్ టెస్ట్ లు – నవంబర్ 25
  • ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదల – డిసెంబర్ 3
  • టెట్ పరీక్ష తేదీ – డిసెంబర్ 10 నుంచి

ఏపీ టెట్ దరఖాస్తు విధానం

Advertisement

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tet2dsc.apcfss.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Step 1- అధికారిక వెబ్‌సైట్‌  https://tet2dsc.apcfss.in/ పై క్లిక్ చేయండి.

Advertisement

Step 2 – హోం పేజీలో ‘Register Here’ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్, క్యాప్చాతో రిజిస్టర్ చేసుకోవాలి.

Step 3 – దరఖాస్తులో లాగిల్ అయి ఫామ్ లో అభ్యర్థి వివరాలను నింపాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక పేమెంట్ చేయాలి. అనంతరం అభ్యర్థికి ఐడీ/రిఫరెన్స్ నంబర్ వస్తుంది.

Step 4 – ఐడీ నెంబర్, పుట్టిన తేదీతో అభ్యర్థి లాగిన్ అవ్వాలి. అనంతరం వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, పేపర్లు, పరీక్షా కేంద్ర వివరాలు నింపాలి. (1-5 తరగతులకు పేపర్ I, 6-8 తరగతులకు పేపర్ II)

Step 5 – స్కాన్ చేసిన విద్యార్హత డాక్యుమెంట్స్/ఫొటో/సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. అలాగే అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.

Step 6 – అప్లికేషన్ సబ్మిట్ కు ముందు ప్రివ్యూ చూసి, వివరాలు సరిచూసుకోవాలి. అనంతరం ఫైనల్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ ఐడీ / అప్లికేషన్ నంబర్‌ వస్తుంది.

Step 7 – అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసుకోండి.

టెట్ పరీక్ష విధానం

పేపర్-IA

1. పిల్లల అభివృద్ధి, బోధనా శాస్త్రం, ICT ఇంటిగ్రేషన్- 30 ప్రశ్నలు- 30 మార్కులు
2. లాంగ్వేజ్- I (తెలుగు/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ఒడియా)- 30 ప్రశ్నలు- 30 మార్కులు
3. లాంగ్జేజ్-II (కంపల్సరీ లాంగ్వేజ్ – ఇంగ్లీష్)- 30 ప్రశ్నలు- 30 మార్కులు
4. గణితం- 30 ప్రశ్నలు- 30 మార్కులు
5. ఎన్విరాన్మెంటల్ స్టడీస్- 30 ప్రశ్నలు- 30 మార్కులు

మొత్తం 150 ప్రశ్నలకు- 150 మార్కులు

పేపర్ – I(B)

1. పిల్లల అభివృద్ధి, బోధనా శాస్త్రం, ICT ఇంటిగ్రేషన్- 30 ప్రశ్నలు- 30 మార్కులు
2. లాంగ్వేజ్- I (తెలుగు/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ఒడియా)- 30 ప్రశ్నలు- 30 మార్కులు
3. లాంగ్జేజ్-II (కంపల్సరీ లాంగ్వేజ్ – ఇంగ్లీష్)- 30 ప్రశ్నలు- 30 మార్కులు
4. గణితం- 30 ప్రశ్నలు- 30 మార్కులు
5. ఎన్విరాన్మెంటల్ స్టడీస్- 30 ప్రశ్నలు- 30 మార్కులు

పేపర్-II(A)

1.పిల్లల అభివృద్ధి, బోధనా శాస్త్రం, ICT ఇంటిగ్రేషన్ – 30 ప్రశ్నలు – 30 మార్కులు
2. లాంగ్వేజ్- I (తెలుగు/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ఒడియా)- 30 ప్రశ్నలు- 30 మార్కులు
3. లాంగ్జేజ్-II ( ఇంగ్లీష్)- 30 ప్రశ్నలు- 30 మార్కులు
4. (a) గణితం అండ్ సైన్స్ – 60 ప్రశ్నలు – 60 మార్కులు (or)
(b). సోషల్ స్టడీస్ – 60 ప్రశ్నలు- 60 మార్కులు (or)
(c). లాంగ్వేజ్ -I (తెలుగు/ఇంగ్లీష్/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళంయ/ఒడియా/సంస్కృతం) – 60 ప్రశ్నలు -60 మార్కులు

మొత్తం 150 ప్రశ్నలు – 150 మార్కులు

Also Read : AP SSC Exams 2026: ఏపీ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్.. మార్చి 16 నుంచి పరీక్షలు.. రూట్ మ్యాప్ తో హాల్ టికెట్లు

పేపర్-II(B)

1.చైల్డ్ డెవలప్‌మెంట్, బోధనా శాస్త్రం, ICT (స్పెషల్ ఎడ్యుకేషన్)- 30 ప్రశ్నలు -30 మార్కులు
2. లాంగ్వేజ్-I (తెలుగు/ఉర్దూ/హిందీ/కన్నడ/తమిళం/ఒడియా/సంస్కృతం)- 30 ప్రశ్నలు -30 మార్కులు
3. లాంగ్వేజ్ -II (ఇంగ్లీష్)- 30 ప్రశ్నలు -30 మార్కులు
4. దివ్యాంగ స్పెషలైజేషన్, బోధనా శాస్త్రం- 60 ప్రశ్నలు -60 మార్కులు

మొత్తం 150 ప్రశ్నలు – 150 మార్కులు

ఏపీ టెట్ సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×