AP SSC Exams 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ పై పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నవంబర్ 1వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి నెల రోజుల సమయం ఇవ్వనున్నారు.
పదో తరగతి హాల్ టికెట్లపై ఎగ్జామ్ సెంటర్ రూట్ మ్యాప్‌ను ప్రింట్ చేయనున్నారు. హాల్ టికెట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి ఎలా చేరుకోవాలో రూట్ మ్యాప్ చూపించనుంది. పదోతరగతి విద్యార్థుల కోసం 100 రోజుల ప్రణాళికను డిసెంబర్ నుంచి అమలు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులను డ్రాప్ బాక్సులో పెట్టకూడదని విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి జిల్లాలో పది తరగతి ఫలితాల్లో వెనుకబడిన 100 స్కూళ్లను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశించింది.
పదో తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా అపార్ ఐడీ ఉండాలని సూచించింది. సార్వత్రిక విద్యా పీఠంలో పదో తరగతి ప్రవేశాలు పెంచాలని విద్యాశాఖ ఆదేశించింది. పది పరీక్షలకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్లను ఆన్‌లైన్ ద్వారా ఎంపిక చేయనున్నారు.
Also Read: BEL Jobs: బెల్ నుంచి జాబ్ నోటిఫికేషన్.. అక్షరాల రూ.90వేల జీతం భయ్యా, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదల చేశారు. 2026 ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల తాత్కాలిక టైమ్ టేబుల్ ను ఇంటర్ బోర్డు ఇటీవ విడుదల చేసింది. పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.