Inter exams: ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు ఇది బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం విడుదల చేశారు. 2026 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలకు పలు కీలక విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు
ఇంటర్ ప్రధాన పరీక్షలు 2026 ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు ప్రభుత్వ ఆమోదంతో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుండి ప్రాక్టికల్స్ ప్రారంభం అవుతాయి. నవంబర్ 1వ తేదీ నుండి పరీక్షల ఫీజులను ఆన్ లైన్ ద్వారా చెల్లించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
ALSO READ: Telangana Government: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆధార్ లింక్ కానీ ఉద్యోగులకు ఇక నో శాలరీ
ప్రాక్టికల్స్ పాత విధానంలోనే ఉంటాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇకపై ల్యాబ్స్, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంగ్లీష్‌తో పాటు, మిగతా భాషల్లోనూ ల్యాబ్ ప్రాక్టీకల్స్ జరిపిస్తారు. సుమారు 12 సంవత్సరాల తర్వాత ఇంటర్ సిలబస్‌లో భారీ మార్పులు చేయబోతున్నట్లు కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల సిలబస్ మారబోతోందని చెప్పారు. NCERT సూచనలు, సబ్జెక్టు కమిటీల సలహాల ప్రకారం ఈ మార్పులు జరుగుతున్నాయి.
ALSO READ: Kavitha: కేసీఆర్ నీడ నుంచి నన్ను దూరం చేశారు.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు
జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల భాగస్వామ్యంతో ఈ సిలబస్ మార్పు ప్రక్రియను 40 నుండి 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబరు 15 నాటికి ఇంటర్ బోర్డు నిర్దేశించిన సిలబస్‌ను తెలుగు అకాడమీకి అందిస్తారు. ఏప్రిల్ నెలాఖరులో కొత్త సిలబస్ బుక్స్ అందుబాటులోకి వస్తాయి. కొత్త సిలబస్‌తో పాటు క్యూఆర్ కోడ్ (QR Code) ముద్రణ కూడా ఉంటుంది. 2026 సంవత్సరం నుండి ACE గ్రూప్ (అకౌంటెన్సీ గ్రూప్) ప్రారంభం కాబోతుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. దీని రూపకల్పన, ఇతర సంబంధిత అంశాలపై ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద, పరీక్షల నిర్వహణతో పాటు, సిలబస్, ప్రాక్టికల్స్‌లో తీసుకొస్తున్న ఈ కీలక మార్పులు తెలంగాణ ఇంటర్ విద్యారంగంలో నూతన అధ్యాయానికి నాంది పలకనున్నాయి.