Kantara Chapter 1 OTT Release Date: రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1′. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2022లో విడుదలైన కాంతార మూవీకి ప్రీక్వెల్ వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. రిలీజ్ తర్వాత ఈ చిత్రం అంచనాలను మించి రెస్పాన్స్ అందుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 పైగా కోట్లు వసూళ్లు చేసింది. అలా 22 రోజుల్లోన కాంతార 1 రూ. 818 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు చేసి 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు బ్రేక్ చేసింది.
అంతేకాదు ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లతో టాప్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టింది. ఛావా, సయారా వంటి బ్లాక్బస్టర్ హిట్ సినిమాలను వెనక్కి నెట్టి ఈ కన్నడ చిత్రం టాప్లో నిలిచింది. మరోవైపు అత్యంత వేగంగా ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా కేజీయఫ్, బాహుబలి వంటి సినిమాలను రికార్డుని కూడా బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించింది. అలా వసూళ్లతో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ముదులిపేందుకు సిద్దం అవుతుంది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కాంతార 1 ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఓటీటీ లవర్స్ తాజాగా ఆమెజాన్ ప్రైం గుడ్న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని ప్రకటించింది. కాగా రిలీజ్ కి ముందే కాంతార : చాప్టర్ 1 ఓటీటీ డీల్ పూర్తయ్యింది. ఫ్యాన్సీ రేటుకి అమెజాన్ మూవీని సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నెల రోజుల లోపే ఓటీటీలోకి తీసుకువస్తుంది. ఓ వైపు థియేటర్లలో ఉండగానే కాంతార 1 ఓటీటీకి వస్తుండటం అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. ఏదేమైన ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఊహించిన టైం కంటే ముందుగానే వస్తుండటంతో ఓటీటీ ప్రియులంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా అక్టోబర్ 31 నుంచి ఈ చిత్రం అమెజాన్లో స్ట్రీమింగ్ కానుందని కాసేపటి క్రితమే సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది.
పూర్వం విజయేంద్ర (జయరామ్) బాంద్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతిడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) కుమారుడు. అతడినకి మహారాజ పట్టాభిషేక్ చేసి విశ్రాంతి తీసుకుంటాడు విజయేంద్ర రాజు. అయితే ఈ రాజ్యానికి సమీపంలో కాంతార పేరుతో కొన్ని తెగల వాళ్లు నివసిస్తుంటారు. అందులో కాంతార తెగకు ప్రత్యర్థులు కడపతి దిక్కువాళ్లు ఉంటారు. తరచూ వీరి మధ్య పోరు జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఓ తెగ బాంగ్రా రాజ్యానికి వస్తుంది. ఈ తెగకు నాయకుడు బర్మే (రిషబ్ శెట్టి). వీరు బాంగ్రా రాజ్యానికి సమీపంలో ఉండటం వల్ల ఈ రాజ్యం ప్రజలతో కలిసిపోయి ఉంటారు. అదే టైంలో బర్మే విజయేంద్ర రాజు కూతురు, యువరాణి కనకవతి (రుక్మిణి వసంత్)తో ప్రేమలో పడతాడు. ఈ విషయంలో తెలుసుకున్న ఆమె అన్న, రాజకుమారుడు కులశేఖరుడు ఈ తెగ పగపడతాడు. ఆ తెగపై గొడవ దిగుతాడు. ఈ క్రమంలో కులశేఖరుడు బర్మే తల్లిని చంపేస్తాడు. ఆ విషయం తెలిసిన బర్మే కులశేఖరుడిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? యువరాణి కనకవతిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఈ కథ వెనక ఉన్న అసలు విలన్ ఎవరనేదే మిగతా స్టోరీ.
get ready to witness the LEGENDary adventure of BERME 🔥#KantaraALegendChapter1OnPrime, October 31@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets @gulshandevaiah #ArvindKashyap @AJANEESHB @HombaleGroup pic.twitter.com/ZnYz3uBIQ2
— prime video IN (@PrimeVideoIN) October 27, 2025