Cricketers Toilet: క్రికెట్.. ఈ క్రీడను మన దేశంలో ఓ ఆటలా మాత్రమే కాకుండా మతంలా చూస్తారు. ఆటగాళ్లను దేవుళ్ళుగా ఆరాధిస్తారు. ప్రతి భారతీయుడికి క్రికెట్ జీవితంలో భాగమైంది. జెంటిల్మెన్ గేమ్ గా పిలిచే ఈ ఆటలో గొప్ప గొప్ప టెక్నిక్స్ తో పాటు ఎంతో ఓపిక కూడా ఉండాలి. అయితే కొన్నేళ్లుగా ఈ ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పులను సైతం తెలుసుకునేందుకు క్రీడాభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. వీటిలో ఒకవేళ క్రికెటర్లు మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తే ఎటువంటి నియమాలను పాటించవలసి ఉంటుంది..? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Shreyas Iyer Injury: శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి విషమం.. స్పెషల్ ఫ్లైట్ లో ఆస్ట్రేలియాకు ఫ్యామిలీ!
క్రికెటర్లు మైదానంలో ఎంతో ఆక్టివ్ గా ఉంటారు. కాబట్టి శరీరంలోని అధిక శాతం నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఒకవేళ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యూరిన్ వస్తే ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే డ్రింక్స్ సమయంలో వెళ్లి రావచ్చు. ఒకవేళ అత్యవసరంగా టాయిలెట్ కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే.. బ్యాట్స్మెన్ అంపైర్ అనుమతి తీసుకొని క్రికెట్ మ్యాచ్ సమయంలో టాయిలెట్ బ్రేక్ కోసం బయలుదేరవచ్చు. ఒకవేళ ఫీల్డర్లకు టాయిలెట్ వస్తే సబ్స్టిట్యూడ్ ప్లేయర్ వస్తాడు. కాబట్టి వారికి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. కొన్ని అత్యవసర పరిస్థితులలో ఆటగాడు రిటైర్డ్ హార్ట్ గా వెళ్లి రావచ్చు. అయితే ఆ బ్యాట్స్మెన్ తరువాత మళ్ళీ బ్యాటింగ్ కి తిరిగి రావాలంటే తదుపరి బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత రావాలి. ఇక ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో టాయిలెట్ బ్రేక్ తీసుకున్న ఆటగాడికి పెనాల్టీ సమయం విధించబడుతుంది. అతడు ఎంతసేపు మైదానం బయట ఉంటాడో.. అంత సమయం పూర్తికాకుండా అతను బౌలింగ్ చేయకూడదు.
Also Read: Ind vs Aus: ఉబర్ లో తిరుగుతున్న టీమిండియా ప్లేయర్లు.. ఏకంగా ఆస్ట్రేలియా వీధుల్లోనే
2017లో మొట్టమొదటిసారిగా భారత్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాట్ రెన్ షా అత్యవసరంగా టాయిలెట్ బ్రేక్ కోసం మైదానం వీడాల్సి వచ్చింది. ఈ సంఘటన అప్పట్లో హాస్య భరితమైన చర్చకు దారితీసింది. ఆ తరువాత 2025 లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా టీ బ్రేక్ కి కొన్ని నిమిషాల ముందు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అత్యవసరంగా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు. 68వ ఓవర్ తర్వాత అంపైర్ అనుమతి తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తాడు. ఈ సంఘటన మూడవ టెస్ట్ మ్యాచ్ చివరి రోజున జరిగింది. ఆ తరువాత జడేజా త్వరగా తిరిగివచ్చి ఆటను కొనసాగించాడు. అయితే ఇది సాధారణంగా అత్యవసరమైన పరిస్థితి తప్ప.. తరచుగా జరిగేది కాదు. ఆటగాళ్లు సాధారణంగా మ్యాచ్ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు.