BigTV English
Advertisement

UCO Bank: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్థానిక భాష వస్తే చాలు, ఇదే మంచి అవకాశం

UCO Bank: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్థానిక భాష వస్తే చాలు, ఇదే మంచి అవకాశం

UCO Bank: నిరుద్యోగులకు ఇది శుభవార్త. యుకో బ్యాంక్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పాసైన వారికి ఇది మంచి అవకాశం. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.15వేల వరకు స్టైఫండ్ అందజేస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, పోస్టులు తదితర వివరాల గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


కోల్‌కతా హెడ్‌ క్వార్టర్స్‌ గా  ఉన్న యుకో బ్యాంక్ నుంచి 2025-26 సంవత్సరానికి 532 అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వెకెన్సీలు ఉన్నాయి. అక్టోబర్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 532


యూకో బ్యాంక్ లో అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఏపీలో 7 పోస్టులు, తెలంగాణలో 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరిజ్ఞానం ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

విద్యార్హత: డిగ్రీ అర్హత గల అభ్యర్థులు అక్టోబర్‌ 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు.

రాష్ట్రాల వారీగా వెకెన్సీ వివరాలు చూసినట్లయితే..

ఏపీ: 7 పోస్టులు

తెలంగాణ: 8 పోస్టులు

తమిళనాడు: 21 పోస్టులు

కర్నాటక: 12 పోస్టులు

కేరళ: 10 పోస్టులు

యూపీ: 46 పోస్టులు

వెస్ట్ బెంగాల్: 86 పోస్టులు

బిహార్: 35 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి.

వయస్సు: 2025 అక్టోబర్ 1 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉండాలి.

స్టైఫండ్: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.15 వేల వరకు స్టైఫండ్ అందజేస్తారు.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800 ఫీజు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 21

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 30

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://uco.bank.in

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 532

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 30

ALSO READ: AIIMS: మంగళగిరిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,68,900 జీతం, ఇంకా 2 రోజులే సమయం

Related News

AP SSC Exams 2026: ఏపీ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అప్డేట్.. మార్చి 16 నుంచి పరీక్షలు.. రూట్ మ్యాప్ తో హాల్ టికెట్లు

AIIMS: మంగళగిరిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,68,900 జీతం, ఇంకా 2 రోజులే సమయం

BEL Jobs: బెల్ నుంచి జాబ్ నోటిఫికేషన్.. అక్షరాల రూ.90వేల జీతం భయ్యా, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

Jobs in RITES: రైట్స్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ మీదే బ్రో, ఇంకెందుకు ఆలస్యం

AP TET 2025 Exam: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. డిసెంబర్ 10న పరీక్ష.. నేడే నోటిఫికేషన్

APSRTC Apprenticeship: ఐటీఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీలో 277 అప్రెంటీస్ పోస్టులు

RRB NTPC Graduate Notification: డిగ్రీ అర్హతతో రైల్వేలో 5,810 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం

Big Stories

×