BigTV English

Apprentice Jobs: 750 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ నెలకు రూ.15,000.. ఇదే మంచి అవకాశం

Apprentice Jobs: 750 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ నెలకు రూ.15,000.. ఇదే మంచి అవకాశం

IOB Apprentice Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) లో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ పాసై ఉంటే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా అందజేపస్తారు. మరి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ఇంపార్టెంట్ డేట్స్, స్టైఫండ్ తదితర వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఇండియన్‌ ఓవర్సిస్‌ బ్యాంక్‌ చెన్నై (IOB) వివిధ రాష్ట్రాల్లో వెకెన్సీ ఉన్న 750 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

నోట్: ఇంకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది..


మొత్తం వెకెన్సీల సంఖ్య: 750

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు: 

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 750 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 10

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 20

వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

స్టైఫండ్: ఈ అప్రెంటీస్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ అందజేస్తారు. నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు స్టైఫండ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.944  ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708 ఫీజు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్థానిక భాష ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://iob.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం

మొత్తం పోస్టుల సంఖ్య: 750

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 20

స్టైఫండ్: నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు స్టైఫండ్

ALSO READ: Jobs in LIC: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు.. ఉద్యోగ ఎంపిక విధానం ఇదే.. డోంట్ మిస్

Related News

Indian Air Force: భారత వాయుసేనలో నాన్- కంబాటెంట్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు.. జీతం రూ.30వేలు

Head Constable Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసై ఉంటే చాలు, పూర్తి వివరాలివే

Jobs in LIC: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు.. ఉద్యోగ ఎంపిక విధానం ఇదే.. డోంట్ మిస్

ఇంటర్, డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే 62వేల జీతం.. ఇంకెందుకు ఆలస్యం..?

BSF Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు భయ్యా

Big Stories

×