Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పరిచయం అవసరం లేని పేరు. ప్రేమమ్ (Premam) సినిమా ద్వారా మలయాళ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయిన అనుపమ, అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ – సమంత హీరో హీరోయిన్లుగా నటించిన “అ ఆ ” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం ఎన్నో అద్భుతమైన తెలుగు సినిమాలలో నటించారు. అనుపమ నటించిన శతమానం భవతి, 18 పేజెస్, కార్తికేయ 2 వంటి సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈమె పరదా (Parada) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఆగస్టు 22వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు.
మీడియా రంగంలో ఉండేదాన్ని…
ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అనుపమకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మీరు హీరోయిన్ కాకపోయి ఉంటే ఎలాంటి వృత్తిలో స్థిరపడి ఉండేవారనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనుపమ సమాధానం చెబుతూ తాను చదువులో ఇంటలిజెంట్ కాదని, అలాగని పూర్ స్టూడెంట్ కూడా కాదు. చదువు అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదని తెలిపారు. ఒకవేళ హీరోయిన్ కాకపోయి ఉంటే కచ్చితంగా మీడియా రంగంలోనే తాను పనిచేసే దాన్ని అంటూ అనుపమ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం కెమెరా ముందు కనిపిస్తున్న తాను హీరోయిన్ కాకపోయుంటే కెమెరా వెనుక, లేదా మీడియా రంగంలో స్థిరపడి ఉండేదాన్ని తెలిపారు.
అంచనాలు పెంచిన ట్రైలర్..
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా అనుపమ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా పరదా సినిమా గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచేశారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.
నా కెరియర్ లో పరదా ప్రత్యేకం..
ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి అనుపమ పరదాలో వచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన సినీ కెరియర్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పరదా సినిమా కంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని ఆశా బావం వ్యక్తం చేశారు. ఈ సినిమాని ముందుగా థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ ఇలాంటి ఒక గొప్ప సినిమాని థియేటర్లో తప్పనిసరిగా చూడాలన్న ఉద్దేశంతో తిరిగి థియేటర్లో విడుదల చేస్తున్నందుకు అనుపమ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం మంచి అంచనాలనే పెంచేశాయి. మరి పరదా సినిమా అనుపమకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.