E-Paper
Advertisement

Head Constable Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసై ఉంటే చాలు, పూర్తి వివరాలివే

Head Constable Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసై ఉంటే చాలు, పూర్తి వివరాలివే
Advertisement

Head Constable Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో 1121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెప్టెంబర్ 23న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1121 పోస్టులు

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్), హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు వెకెన్సీలు:

హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు: 1121 (మొత్తం ఉద్యోగాలు)

రేడియో ఆపరేటర్: 910 పోస్టులు

రేడియో మెకానిక్: 211 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్, ఐటీఐ, ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 24

దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 23

జీతం: ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వేతనం ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.bsf.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు  అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.81వేల వరకు వేతనం లభించనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1121

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 23

జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వేతనం

ALSO READ: Apprentice Jobs: 750 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ నెలకు రూ.15,000.. ఇదే మంచి అవకాశం

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×