Rock Salt Remedies: ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా..? ఏదైనా పని మీద వెళ్లినప్పుడు పని సక్సెస్ కావడం లేదా..? ఏం చేసినా మీకు కలిసి రావడం లేదా..? అయితే రాళ్ల ఉప్పు పరిహారం మీకు బాగా పనికొస్తుందంటున్నారు పండితులు. ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం కోసం ఉప్పు పరిహారం ఎంతో పవర్‌ఫుల్‌గా పని చేస్తుందంటున్నారు పండితులు. ఆ రెమెడీస్ ఏంటో ఇప్పడు ఈ కథనంలో తెలుసుకుందాం.
తంత్రశాస్త్రంలో ఉప్పుకు ఎంతో శక్తి ఉంటుందంటున్నారు పండితుల. ఎన్నో రకాలైన సమస్యలను సాల్వ్ చేయడంలో ఉప్పుతో చేసే రెమెడీస్ చాలా పవర్‌ఫుల్‌గా పని చేస్తాయంటున్నారు. ఆర్థికపరమైన సమస్యలతో పాటు కొన్ని సమస్యలకు ఉప్పుతో పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుదాం.
పని మీద బయటకు వెళ్లినప్పుడు: ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు కాస్త రాళ్ల ఉప్పును చూసి వెళ్లారంటే మీరు అనుకున్న పని నెరవేరుతుందట. అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి వెళ్తున్నప్పుడు.. మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుందట.
ఖర్చులు తగ్గించడానికి: మీరు విపరీతంగా ఖర్చులు పెడుతున్నప్పుడు.. ఆ ఖర్చులను మీరు నియంత్రించుకోలేనప్పుడు కూడా ఉప్పు పరిహారం బాగా పని చేస్తుందట. చిటికెడు రాళ్ల ఉప్పును తీసుకుని దాన్ని తెల్ల కాగితంలో చుట్టి పర్సులో పెట్టుకుంటే మీరు చేసే వృథా ఖర్చులు తగ్గిపోతాయట.
ఇంటిని శుభ్రం చేయడం: వారానికి ఒక్కసారి అయినా మీ ఇంటిని రాళ్ల ఉప్పు కలిసిన నీటితో శుభ్రం చేసుకోవాలట. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుందట. ఇంకా రాళ్ల ఉప్పుతో పాటు కాస్త పసుపు కలిపి శుభ్రం చేసుకుంటే లక్ష్మీ దేవి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుందట.
స్నానం చేయడం: మనిషికి ఉన్న దిష్టి దోషాలు పోవడానికి రాళ్ల ఉప్పు బాగా పని చేస్తుందట. సాధారణంగా చాలా మంది దిష్టి తగిలిందంటే డైరెక్టుగా ఉప్పుతోనే దిష్టి తీస్తుంటారు. అది ఒకరకంగా మంచిదే కానీ ఇంకా వారానికి రెండు సార్లు స్నానం చేసే నీటిలో రాళ్లు ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే దిష్టి పోవడమే కాకుండా ఎదైనా నెగెటివ్ ఎనర్జీ ఉంటే అంతా పోతుందట.
దంపతులు మధ్య అన్యోన్యత: రాళ్లు పరిహారంతో విడిపోయిన దంపతులను కూడ కలపొచ్చు అంటున్నారు పండితులు. అలాగే ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతున్నా.. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా.. కళ్లు ఉప్పు పరిహారం అద్బుతంగా పని చేస్తుందట. ఒక గాజు గ్లాసులో రాళ్ల ఉప్పు నింపి దాన్ని బెడ్రూంలో ఏదైనా మూలన పెట్టాలట. దీంతో విడిపోయే స్టేజీలో ఉన్న దంపతులు మధ్య కూడా సయోద్య కుదురుతుందట. ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు గట్టిగా మారతాయట. అయితే ఈ పరిహారం నిరంతరం చేస్తూనే ఉండాలి. అయితే గాజు గ్లాసులోని ఉప్పును వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు