Wealth Growth: అమాంతం మీ సంపద పెరగాలా…? చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తారా..? మీ జీవితం రాకెట్ లా అభివృద్ది పథంలో పరుగెత్తాలా..? ఆర్థిక సమస్యలన్నీ తీరి మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలా..? అయితే శాస్త్రం ప్రకారం ఇలా చేయమని సూచిస్తున్నారు పండితులు. అసలు ఎలా చేయాలో ఏం చేయాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
మీ ఇంట్లో సంపద పెరిగి మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలా..? అయితే శాస్త్రం ప్రకారం కొన్ని రెమెడీలు పాటిస్తే మీ కష్టాలు తీరిపోయి మీరు హ్యాపీగా ఉంటారట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటి సింహ ద్వారం: ఇంట్లో సంపద పెరగాలన్నా..? ఆ ఇంట్లో ఆర్థిక కష్టాలు తీరాలన్నా..? కుటుంబ ఆదాయం పెరిగి సిరి సంపదలు రావాలన్నా ముఖ్యంగా ఆ ఇంట్లో సింహ ద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలట. అప్పుడే బయటి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందని పండితులు చెప్తున్నారు.
ఈశాన్య దిశలో మొక్కలు పెంచకూడదు: ఇంట్లో సంపద పెరగాలంటే ఎప్పుడూ కూడా ఈశాన్యంలో మొక్కలు అస్సలు పెంచకూడదట. ఎప్పుడైనా ఈశాన్యంలో నీటి నిల్వ చేసుకోవడం లేదా దేవుడికి కేటాయించినట్టుగా ఖాళీగా శుభ్రంగా ఉంచుకోవాలట. అప్పుడే ఇంట్లో సంపద పెరుగుతుందట.
పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టడం: ఇంటి ఆవరణలోని పక్షులకు ఆహారం పెట్టడం. వాటికి నీరు అందుబాటులో ఉంచడం. ఇలా చేయడం వల్ల ఇంటి ఆవరణలోకి పక్షులు వస్తాయి. దీంతో ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుందట. అలాగే కుక్కలు, ఆవులు లాంటి జంతువులకు అప్పుడప్పుడు ఆహారం పెడుతుండాలట. ఇది కూడా సంపద ఆహ్వానానికి మూలం అంటున్నారు.
ఇంట్లో నీళ్లు లీక్ కాకుండా చూసుకోవాలి: ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని లీక్ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బాత్రూంలో కుళాయిల్లో నీళ్లు లీక్ అయితే అది నెగెటివ్ ఎనర్జీ కి స్వాగతం పలికినట్టు అవుతుందట. అందుకే నీళ్లు లీక్ కాకుండా చూసుకోవాలని పండితులు హెచ్చరిస్తున్నారు.
బీరువా: ఇంట్లో డబ్బు పెట్టుకునే బీరువాను ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రంగా ఉంచుకోవాలట. అందులో అనవసరమైన వస్తువులు పెట్టకూడదట. అలా చేయడం వల్ల లక్ష్మీ దేవి మీ ఇంట్లోంచి వెళ్లిపోతుందట. బీరువా శుభ్రంగా నీటుగా ఉంటే లక్ష్మీ దేవి అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుందట.
అక్వేరియం: ఇంట్లో ఎప్పుడూ అక్వేరియం ఉంచడం వల్ల డబ్బును ఆకర్షిస్తుందట. ఎప్పుడైనా హాల్లో అక్వేరియం ఉంచాలట. అందులో చేపలు కచ్చితంగా ఉండాలట.
ఇంటి ముందు రహదారి: ఇంటి ముందు రహదారి విషయంలో కూడా తప్పులు చేయకూడదు. రహదారి కన్నా మీ ఇల్లు ఎత్తులో ఉండాలట. అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. అలా కాకుండా ఇల్లు రహదారి కన్నా కిందకు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ నెగెటివ్ ఎనర్జీ రాజ్యమేలుతుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు