BigTV English

ఇంటర్, డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే 62వేల జీతం.. ఇంకెందుకు ఆలస్యం..?

ఇంటర్, డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే 62వేల జీతం.. ఇంకెందుకు ఆలస్యం..?

OICL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అని చెప్పవచ్చు.. ఒరియంట్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఓఐసీఎల్) లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియ్, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, మొత్తం పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)లో 500 క్లాస్-III కేడర్‌- అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 2 నుంచి 17 తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రిలిమినరి పరీక్ష సెప్టెంబర్‌ 7న టైర్‌-2 మెయిన్స్‌ ఎగ్జామ్‌ అక్టోబరు 28న నిర్వహించనున్నారు.


మొత్తం వెకెన్సీల సంఖ్య: 500

ఇందులో అసిస్టెంట్ క్లాస్ – కేడర్ 3  ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా 26 పోస్టుల వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎస్‌ఎస్‌సీ/హెచ్‌ఎస్‌సీ/ఇంటర్మీడియట్/డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో పాసై ఉంటే సరిపోతుంది. దరఖాస్తు చేసిన స్టేట్/యూనియన్ టెరిటరీ రీజినల్ లాంగ్వేజ్‌లో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి.

ముఖ్యమైన డేట్స్:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్ట్ 2

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 17

ప్రిలిమనరీ ఎగ్జామ్: 2025 సెప్టెంబర్ 7

మెయిన్స్ ఎగ్జామ్: 2025 అక్టోబర్ 28

వయస్సు: 2025 జులై 31 నాటికి ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.22,405 నుంచి రూ.62,265 వరకు జీతం ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష (టైర్‌-I), మొయిన్స్‌ ఎగ్జామ్ (టైర్‌-II), రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జీకే నుంచి ప్రశ్నలు వస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.850 ఫీజు పే చేసి ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.

ఎగ్జామ్ సెంటర్స్: హైదరాబాద్, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలు, విజయనగరం, తిరుపతి, రాజమహేంద్రవరం.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://orientalinsurance.org.in/careers

ALSO READ: LIC Notification: ఎల్ఐసీలో 491 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,69,025 వేతనం

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 17

Related News

Canara Bank Notification: డిగ్రీతో భారీ అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేస్తే చాలు.. సెలెక్ట్ అవుతారు..!

RRB ALP Result 2025: ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

RRB JE: రైల్వేలో వేలల్లో జేఈ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే బంగారు భవిష్యత్తు మీ సొంతం, దరఖాస్తుకు ప్రారంభ తేది ఇదే

AP RDMHS: ఏపీలో టెన్త్ క్లాస్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వేతనం, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

Group-3 Selection List: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ప్రొవిజినల్ జాబితా విడుదల.. నేటి నుంచి వెబ్ ఆప్షన్స్

SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో

JEE Main-2026: ఐఐటీ మెయిన్స్ అభ్యర్థులు అలర్ట్.. NTA కీలక సూచనలు

Big Stories

×