Indian Air Force: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. భారత్ వాయుసేన అగ్నిపథ్ స్కీమ్ లో భాగంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. టెన్త్ క్లాస్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులవుతారు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, వయస్సు, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత వాయుసేన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు నాన్-కంబాటెంట్ నియామకానికి (ఇన్‌టేక్ 01/2026) నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక వాయుసేన కేంద్రాలలో ఖాళీగా ఉన్న హాస్పిటాలిటీ, హౌస్ కీపింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 1న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టు పేరు..
వాయుసేనలో అగ్నివీర్ వాయు నాన్ కంబాటెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విభాగాలు: హాస్పటాలిటీ, హౌస్ కీపింగ్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది. అవివాహిత పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కనీస ఎత్తు 152 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 1
వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే వారి వయస్సు 21 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఏడాదికి నెలకు రూ.30 వేల వరకు జీతం ఉంటుది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ఉద్యోగ ఎంపిక విధానం: దరఖాస్తుల పరిశీలన, రాత పరీక్ష, స్కిల్, ప్రాక్టికల్ టెస్ట్, శారీరక సామర్థ్య టెస్ట్, మెడికల్ టెస్ట్, తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు పత్రాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారాన్ని ఫిల్ చేసి సంబంధిత సర్టిఫికెట్స్ తో కలిపి పోస్ట్ లేదా డ్రాప్ బాక్స్ ద్వారా దేశంలో ఉన్న వాయుసే కేంద్రాలకు పంపిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://agnipathvayu.cdac.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
దరఖాస్తుకు లాస్ట్ డేట్: 2025 సెప్టెంబర్ 1
జీతం: రూ.30వేలు ఉంటుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
ALSO READ: Head Constable Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసై ఉంటే చాలు, పూర్తి వివరాలివే