Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం అన్ని జట్లలో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. భారత అభిమానులు కూడా టీమ్ ఇండియా స్క్వాడ్ ని తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఓ నివేదిక ప్రకారం రేపు {ఆగస్టు 19}న ఆసియా కప్ టి-20 కోసం టీమ్ ఇండియాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం అన్ని దేశాలు ఈసారి పూర్తిగా యువ క్రికెటర్లతో రంగంలోకి దిగబోతున్నాయి.
Also Read: Umpire Injured: ఎంతకు తెగించార్రా… ఏకంగా అంపైర్ ప్రైవేట్ పార్ట్స్ పైనే దాడి చేసిన బంగ్లా ప్లేయర్లు
టీమ్ ఇండియాలో ఇప్పటికే స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ-20 ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టి-20 ఫార్మాట్ కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నీ కోసం గిల్, యశస్వి జైష్వాల్ ని తీసుకోవడం కూడా సందేహంగా మారింది. అలాగే రింకు సింగ్ ని కూడా ఈ టోర్ని నుంచి బయటకు పంపవచ్చని ఓ నివేదిక పేర్కొంది. అలాగే రిషబ్ పంత్ గాయం కారణంగా బాధపడుతుండడంతో జితేష్ శర్మని రెండవ వికెట్ కీపర్ గా జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు మహమ్మద్ సిరాజ్ ని కూడా ఈ జట్టులోకి తీసుకోవడం లేదు. దీంతో పూర్తిగా యువ క్రికెటర్లతో ఈ టోర్నీలో రంగంలోకి దిగబోతోంది టీమిండియా. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే పాకిస్తాన్ కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకి సల్మాన్ అలీ అఘా కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ లపై పిసిబి వేటు వేసింది. ఈ ఇద్దరినీ ఆసియా కప్ జట్టులోకి తీసుకోలేదు. గతంలో వీరిద్దరిని పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు రెండు కళ్లుగా పేర్కొనేవారు.
ప్రస్తుతం వీరిద్దరూ లేకుండానే, పూర్తిగా యువ క్రికెటర్లతో ఆసియా కప్ లో పాల్గొనబోతోంది పాకిస్తాన్. అలాగే శ్రీలంక జట్టు కూడా మ్యాథ్యూస్ లేకుండానే ఆసియా కప్ 2025 బరిలో దిగబోతోంది. ఇక బంగ్లాదేశ్ కూడా షాకీబ్ లేకుండానే ఈ టోర్నీలో పాల్గొనబోతోంది. ఇలా చాలా దేశాలు సీనియర్ ఆటగాళ్లు లేకుండానే ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. దీంతో ఎంతో అనుభవం ఉన్న క్రికెటర్లను మిస్ కాబోతున్నామని క్రీడాభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ టోర్నీలో పాల్గొనే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడదీస్తారు.
Also Read: Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ కారు నెంబర్ సీక్రెట్ ఇదే.. లక్షలు పెట్టి మరి కొన్నాడా!
ఇందులో గ్రూప్ దశ మ్యాచ్ లు ముగిసిన తర్వాత టాప్ టు లో నిలిచిన మొత్తం నాలుగు జట్లు సూపర్ 4 కి చేరతాయి. ఇందులో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం టాప్ 2 లో నిలిచిన రెండు జట్లు ఫైనల్ కి చేరుతాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతుంది. 2023లో జరిగిన ఆసియా కప్ లో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. ఈ ఆసియా కప్ లో భారత్ ఎనిమిది సార్లు ఛాంపియన్ గా నిలిస్తే.. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు గెలిచింది. ఇక 17వ సారి జరిగే ఈ ఆసియా కప్ లో ఎవరు చంపియన్ గా నిలుస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.