Shruthi Hassan: సౌత్ సినీ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు కమల్ హాసన్ (Kamal Hassan) ఒకరు.ఈయన వారసురాలిగా శృతిహాసన్(Shruthi Hassan) సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. శృతిహాసన్ తాజాగా లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj)దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన కూలీ సినిమా(Coolie Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో మరోసారి తన నటనతో శృతిహాసన్ ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇందులో సైమన్ అనే విలన్ పాత్రలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన సంగతి తెలిసిందే.
అన్నపూర్ణ స్టూడియోతో అనుబంధం..
ఈ సినిమా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం పలు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నాగార్జున (Nagarjuna)శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జున శృతిహాసన్ ప్రశ్నిస్తూ.. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)తో నీకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని విన్నాను ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ తాను పుట్టకముందే అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగు పెట్టానని షాకింగ్ సమాధానాన్ని తెలిపారు. మా అమ్మ తన చివరి సినిమా పేరు గుర్తులేదు కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో అన్నపూర్ణ స్టూడియోలో లాస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది.
అమ్మ పొట్టలో ఉన్నప్పుడే..
ఆ సమయంలో తాను అమ్మ పొట్టలో ఉన్నానని అప్పుడు అమ్మ అయిదున్నర నెల ప్రెగ్నెంట్ కావడంతో పుట్టకముందే నాకు అన్నపూర్ణ స్టూడియోతో మంచి అనుబంధం ఉందని శృతిహాసన్ తెలిపారు. ఈ విషయం గురించి అమ్మ నాతో ఎన్నో సందర్భాలలో మాట్లాడుతూ నీ డెబ్యూ మూవీ ఇదే అంటూ చెబుతూ ఉండేది. అదేవిధంగా తాను హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా అనగనగా ధీరుడు సినిమా మొదటి రోజు షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగిందని, అన్నపూర్ణ స్టూడియోతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
?igsh=aXBrMHFudHZ6cW1v
హైదరాబాదులో అన్నపూర్ణ స్టూడియో ఎన్నో సినిమాల చిత్రీకరణకు నిలయంగా మారిన సంగతి తెలిసిందే అన్నపూర్ణ స్టూడియోతో ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇలా నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో అని ప్రారంభించి సరిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే శృతిహాసన్ కూడా అన్నపూర్ణ స్టూడియో తో తనకున్న అనుబంధం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ కెరియర్ విషయానికి వస్తే..అనగనగా ధీరుడు(Anaganaga Dheerudu) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన శృతిహాసన్ కు మొదటి సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇలా పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పాలి. వరుస సినిమాలో డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ అంటూ ఈమె పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి అయితే గబ్బర్ సింగ్ సినిమా హిట్ కావడంతో శృతిహాసన్ కెరియర్ పూర్తిగా మారిపోయింది.
Also Read: Anupama Parameswaran: ఆ ఒక్క రూమర్.. నా కెరియర్ ను నాశనం చేసింది.. అనుపమ ఎమోషనల్!