LIC Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, దరఖాస్తు విధానం గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబయి(LIC) ఖాళీగా ఉన్న 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. సెప్టెంబర్ 8న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 350
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు: 350
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. ఈ అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ముఖ్యమైన డేట్స్..
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 16
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 8
వయస్సు: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.88,635 – రూ.1,69,025 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.700 పే చేసేి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఇంటిమేషన్ ఛార్జీ ఉంటుంది. అది రూ.85 ఉండటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎగ్జామ్ తేదీలు..
ప్రిలిమ్స్ : 2025 అక్టోబర్ 3
మెయిన్స్: నవంబర్ 8
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్సైట్: https://licindia.in/
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 350
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 8
ALSO READ: Comedy video: లిఫ్ట్ బయట ఈ పిల్లోడు చేసిన పని చూస్తే.. నవ్వు ఆపకోలేరు భయ్యా..!