Big Stories

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులు.. జీతం లక్షకు పైనే

Indian Army: ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్ చేసిన టెక్నికల్ గ్రాడ్యుయేట్ ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు పోస్టుల వివరాలను కూడా తెలిపారు. ఆన్ లైన్ గడువు పూర్తయ్యేలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఎస్ఎస్బీ రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎంపికైన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ కోర్సులో శిక్షణ అందించనుంది. సివిల్ 7, కంప్యూటర్ సైన్స్ 7, మెకానికల్ 7, ఎలక్ట్రికల్ 3, ఎలక్ట్రానిక్స్ 4, ఇతర విభాగాల్లో 2 పోస్టులకు గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

- Advertisement -

విద్యార్హతలు..

- Advertisement -

ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులుగా పరిగణిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులను కూడా అర్హులుగా తీసుకుంటున్నారు. ఈ మేరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2025 జనవరి 1 తేదీన నాటికి 27 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. 1998 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధిస్తారు.

సెలక్షన్ ప్రాసెస్​..

పెళ్లి కాని పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు అని టీజీసీ ప్రకటించింది. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ వెబ్ సైట్ https://joinindianarmy.nic.inలో పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి దరఖాస్తు ఫీజును తీసుకోవడం లేదు. ఇంటర్వ్యూకు హజరైన వారికి ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తుంది.

జీతభత్యాలు..

లెవల్ 10 స్కేల్ ప్రకారం లెఫ్టినెంట్ ఉద్యోగంలో చేరిన తర్వాత రూ. 56,100 సాలరీ ఉంటుంది. అదనంగా రూ. 15,500 మిలిటరీ సర్వీస్ పే చెల్లిస్తారు. వీటితో పాటు డీఏ కూడా ఉంటుంది. మొత్తంగా లక్షకు పైగానే జీతం చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మే 9 మద్యాహ్నం 3 గంటలకు మాత్రమే స్వీకరించనున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News