Prasar Bharati: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. న్యూఢిల్లీలో ప్రసార భారతి లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా(జర్నలిజం) పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
నోట్: దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 21
న్యూఢిల్లీలోని ప్రసార్ భారతి (భారత ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్)లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో సీనియర్ కరస్పాండెంట్, యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-2, బులిటెన్ ఎడిటర్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 59
పోస్టులు – వివరాలు
పోస్టు పేరు – ఖాళీలు
1. సీనియర్ కరస్పాండెంట్: 02
2. యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-2: 07
3. యాంకర్ కమ్ కరస్పాండెంట్ గ్రేడ్-3: 10
4. బులిటెన్ ఎడిటర్: 04
5. బ్రాడ్ కాస్ట్ ఎగ్జిక్యూటివ్: 04
6. వీడియో పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్: 02
7. అసైన్‌మెంట్ కో-ఆర్డినేటర్: 03
8. కంటెంట్ ఎగ్జిక్యూటివ్: 08
9. కాపీ ఎడిటర్: 07
10. కాపీ రైటర్: 01
11. ప్యాకింగ్ అసిస్టెంట్: 06
12. వీడియోగ్రాఫర్: 05
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా (జర్నలిజం) పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 21
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సును నిర్ధారించారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. మంచి జీతం ఉంటుంది. నెలకు రూ.25,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థులను ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://prasarbharati.gov.in/pbvacancies/