E-Paper
Advertisement

CDAC POSTS: సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. తెలంగాణలోనూ భారీగా వెకెన్సీలు, ఈ అర్హత ఉంటే చాలు..!

CDAC POSTS: సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. తెలంగాణలోనూ భారీగా వెకెన్సీలు, ఈ అర్హత ఉంటే చాలు..!

CDAC: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతన అందజేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

నోట్: దరఖాస్తుకు పది రోజులే గడువు

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 20

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, నోయిడా, పుణె, తిరువనంతపురం, గువాహటి సెంటర్‌ లలో 646 ప్రాజెక్ట్‌ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అక్టోబర్ 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 646

సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

సెంటర్ల వారీగా వెకెన్సీ వివరాలు…

బెంగళూరు: 110 పోస్టులు

చెన్నై: 105 పోస్టులు

హైదరాబాద్: 65 పోస్టులు

కోల్ కతా: 6 పోస్టులు

ముంబై: 12  పోస్టులు

నోయిడా: 173 పోస్టులు

పూణె: 99 పోస్టులు

తిరువనంతపురం: 54 పోస్టులు

సీఐఎన్ఈ గౌహతి: 22 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ పాసై ఉండాలి. అలాగే వర్క్  ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 1

దరఖాస్తుకు చివరి తేది: 2025 అక్టోబర్ 20

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే దరఖాస్తు ఫీజు అవసరం లేదు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://cdac.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం: 

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 646

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 20

దరఖాస్తుకు ఇంకా పది రోజులు మాత్రమే గడువు ఉంది…

ALSO READ: APPSC FBO Results 2025: ఏపీపీఎస్సీ అటవీ శాఖ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×