ECIL Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. డిప్లొమా, బీఈ/బీటెక్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్, అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ విధానంలో 90 టెక్నికల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ఆర్టీజన్ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. హెడ్‌క్వార్టర్స్ గల హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో 24 వెకెన్సీలు ఉన్నాయి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 90
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ఆర్టీజన్, జూనియర్ ఆర్టీజన్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
జోన్ల వారీగా వెకెన్సీలు..
న్యూ దిల్లీ నార్త్‌జోన్: 27 పోస్టులు
ముంబయి, వెస్ట్ జోన్: 26 పోస్టులు
బెంగళూరు, చెన్నై, సౌత్ జోన్: 11 పోస్టులు
కోల్‌కతా, ఈస్ట్‌జోన్: 02 పోస్టులు
హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్: 24 పోస్టులు
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్ పాసై ఉండాలి. లేదా ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు మొదటి ఏడాది రూ.40,000; రెండో ఏడాది రూ.45,000; మూడో ఏడాది రూ.50,000; నాలుగో ఏడాది రూ.55,000 జీతం ఉంటుంది. టెక్నికల్ ఆఫీసర్‌కు మొదటి ఏడాది రూ.25,000; రెండో ఏడాది రూ.28,000; మూడు, నాలుగో ఏడాది రూ.31,000. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.25,506; సీనియర్ ఆర్టీజన్‌కు రూ.23,368; జూనియర్ ఆర్టిజన్‌కు రూ.23,218 జీతం ఉంటుంది.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 33 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్ల వయస్సు మించరాదు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఇంటర్వ్యూ డేట్స్: 15, 16, 17, 18.10.2025.
వేదిక: కోల్‌కతా, న్యూదిల్లీ, బెంగళూరు, చెన్నై ఈసీఐఎల్ జోనల్ ఆఫీస్; సీఎల్‌డీసీ, నలందా కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్.