Big Stories

Office :  ఆఫీస్‌లో తప్పులు చేస్తే.. తిప్పలే!

Office : ప్రస్తుత పోటీ ప్రపంచంలో.. ప్రతి రంగంలోనూ విపరీతమైన పోటీ ఉంది. అసలు ఉద్యోగం దొరకడమే కష్టంగా ఉంటే.. దొరికిన ఉద్యోగాన్ని నిలదొక్కుకోవడం మరింత కష్టంగా మారిపోయింది. ఈ పరిస్థితిలో మీరు కాలేజ్‌ లైఫ్‌ తర్వాత మొదటి ఉద్యోగంలో చేరినా.. లేదా ఒక ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగానికి మారినా.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం అవసరం. అవేంటంటే?

- Advertisement -

ఆఫీస్ కల్చర్‌పై అవగాహన..
విద్యార్థి జీవితం నుంచి ఉద్యోగ జీవితానికి మారడం ఎవరికీ అంత సులభం కాదు. అలాగే పాత ఆఫీస్ వాతావరణం నుంచి కొత్త ఆఫీస్‌ కల్చర్‌కు మారడం కూడా అంత సులభం కాదు. అందుకే మీరు మొదట్లోనే ఆఫీస్ కల్చర్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆఫీస్ రూల్స్‌కు విరుద్ధంగా ఎలాంటి తప్పులూ చేయొద్దు. మీ ప్రవర్తన బాగుంటేనే మీ సీనియర్లు మిమ్మల్ని ఎక్కడికైనా సిఫార్స్‌ చేస్తారన్నది మర్చిపోవద్దు!

- Advertisement -

కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొద్దు..
తోటి వారితో లేదా మీ సీనియర్లతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి. మీ కాలేజీ ఫ్రెండ్స్‌తో వెటకారంగా మాట్లాడినట్టు ఆఫీస్‌‌లో మాట్లాడొద్దు. వీలైనంత వరకు.. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు.. మీ కాల్స్, చాటింగ్ భాషను నియంత్రించుకోండి. లేదంటే సీనియర్లు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. దీంతో మీపై చెడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News