Pragati Scholarship Scheme : తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు.. ప్రగతి స్కాలర్‌షిప్

Pragati Scholarship Scheme : తెలుగు రాష్ట్రాల అమ్మాయిలకు.. ప్రగతి స్కాలర్‌షిప్

Scholarships
Share this post with your friends

Scholarships

Pragati Scholarship Scheme : ఆల్ ఇండిమా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ‘ప్రగతి స్కాలర్‌షిప్‌ స్కీమ్‌’ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ స్కీమ్‌ ద్వారా డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో అర్హులైన అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తారు. సరైన అర్హతలున్న తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ఇలా కేటాయింపు..
డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో ఒక్కోదానికి 5,000 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 10,000 స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా నిర్దేశిత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులందరికీ స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు. డిప్లొమా కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 318, తెలంగాణకు 206 స్కాలర్‌షిప్‌లు కేటాయించారు. డిగ్రీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు 566, తెలంగాణకు 424 స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నారు.

అర్హత:
టెక్నికల్‌ డిప్లొమా రెగ్యులర్‌ కోర్సులో చేరినవారికి మూడేళ్లు, లేటరల్‌ ఎంట్రీ అభ్యర్థులకు రెండేళ్లపాటు ఏటా రూ.50,000 అందిస్తారు. ఏదైనా టెక్నికల్‌ డిప్లొమా లెవెల్‌ కోర్సు అభ్యసిస్తూ ఉండాలి. లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా రెండో సంవత్సరం ప్రవేశాలు పొందిన అభ్యర్థులు అర్హులే. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు. అర్హులైతే ఒకే కుటుంబం నుంచి ఇద్దరమ్మాయిలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 31


వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/


Share this post with your friends

ఇవి కూడా చదవండి

NIMS : నిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం..

BigTv Desk

ITBP : ఐటీబీపీలో 293 ఖాళీలకు నోటిఫికేషన్…

BigTv Desk

Intelligence Bureau Jobs : ఇంటలిజెన్స్ బ్యూరోలో 1671 పోస్టులు.. అర్హత పదవ తరగతి మాత్రమే..

BigTv Desk

DRDO Jobs : డీఆర్‌డీవోలో 1061 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

BigTv Desk

Bank Of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్ జాబ్స్…

BigTv Desk

IBM: 3900 మంది ఉద్యోగులకు ఐబీఎం గుడ్‌బై

Bigtv Digital

Leave a Comment