BigTV English

Christmas Tree: క్రిస్మస్ ట్రీని ఎప్పటి వరకు ఉంచాలి

Christmas Tree: క్రిస్మస్ ట్రీని ఎప్పటి వరకు ఉంచాలి

Christmas Tree: క్రిస్మస్ సందడి ప్రారంభమైపోయింది. అందరి ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలు ప్రతీ చోట దొరుకుతున్నాయి.. అప్పట్లో సరివి చెట్ల కొమ్మలు తెచ్చి, దాన్ని క్రిస్మస్ ట్రీలా అలకరించేవారు. క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైంది. 15వ శతాబ్ధంలో లివోనియాలో మొదట క్రిస్మస్‌ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలయ్యింది అని చెప్తుంటారు. చారిత్రకంగా క్రిస్మస్‌ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్‌ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించింది


1816లో నస్సావో-విల్‌బర్గ్ యువరాణి హెన్‌రేటా క్రిస్మస్‌ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసిందట. ఆతర్వాత ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి పాకింది. ఫ్రాన్స్‌లోకి 1840లో డచ్‌ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్‌ లో 19వ శతాబ్ద ప్రారంభంలో క్రిస్మస్‌ సంప్రదాయంలో భాగమైంది. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంతో జనబాహుళ్యంలోకి ప్రాచుర్యం పొందింది. మార్టిన్ లూథర్ కింగ్ మొదటగా ఈ చెట్టుకు దీపాలు పెట్టి అలంకరించారు. నాటి నుంచి క్రిస్మస్ చెట్టును పళ్లు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తూ వస్తున్నారు.

ప్రపంచంలోని అన్ని నాగరికతలు చెట్లు, వృక్షాలను పచ్చదనానికి , ఆనందానికి, చిహ్నంగా తెలియచెప్పాయి. సిరిసంపదలుగా తెచ్చేవాటిగా గుర్తించారు. అందులో భాగమే క్రిస్మస్ ట్రీ అలంకరణ. చెట్టైనా, మొక్కయినా ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని రంగుల రంగులత దీపాలతో అలంకరించడం వెనుక అసలు విషయం


క్రిస్మస్ ట్రీ అనేది క్రిస్మస్ వేడుకలకు గొప్ప సింబాలిజం . ఆకుపచ్చ రంగు , వాటి ఆకృతి దేవుని జీవితం మరియు ప్రేమ యొక్క చిహ్నాలు, మరియు దానిని అలంకరించే లైట్లు క్రిస్మస్ ఈవ్ యొక్క రహస్యాన్ని సూచిస్తాయి . క్రిస్మస్‌ ప్రారంభానికి ముందు తమ ఇళ్లకు క్రైస్తవులు నక్షత్ర ఆకృతులను అలంకరించుకుంటారు. తూర్పు దేశాల వారికి దారి చూపిన దివ్య నక్షత్రాన్ని క్రీస్తు జయంతి సందర్భంగా ప్రత్యేక చిహ్నంగా భావిస్తారు. అందుకు క్రీస్తు రాకను కాంక్షిస్తూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, ఇళ్లపై అలంకరించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.
క్రిస్మస్ చెట్టును తొలగించడానికి ఖచ్చితమైన తేదీ లేదు, మెక్సికో సాధారణంగా జనవరి 6, త్రీ కింగ్స్ డే తర్వాత దీన్ని చేస్తారు. ఇంకొంతమంది ఫిబ్రవరి 2, క్యాండిల్‌మాస్ డే వరకు ఉంచుతారు.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×