Bus Accident: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలను బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. పది రోజుల గ్యాప్ లోనే మూడు, నాలుగు భారీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రజలను కలవరపెడుతున్నాయి. సురక్షిత ప్రయాణం అనుకున్న బస్సులు కూడా రోడ్డు ప్రమాదాలకు గురి అవుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
తాజాగా అనంతపురం జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. అదృష్టం కొద్ది పెను ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకుంట గ్రామ సమీపంలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. పుట్లూరు మండల కేంద్రం మోడల్ స్కూల్, జెడ్పీ స్కూల్ పిల్లల్ని దాదాపు 50 మంది విద్యార్థులను ఎక్కించుకుని బస్సు బయల్దేరింది. చింతకుంట దగ్గర పంట పొలాల్లోకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో మోడల్ స్కూలు, జడ్పీ హైస్కూల్ కు చెందిన ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం చోటుచేసుకోలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్ పిల్లలతో మడ్డిపల్లి కి వెళ్తుండగా చింతకుంట వద్ద స్టీరింగ్ స్ట్రక్ కావడంతో పొలాల్లోకి దూసుకెళ్లినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన