BigTV English

katuka (Kajal) : కాటుక కళ్లతో దృష్టి తగలదా…

katuka (Kajal) : కాటుక కళ్లతో దృష్టి తగలదా…

katuka (Kajal): చెవులకు కమ్మలు, కళ్ల కాటుక ఎంత అందాన్ని తెచ్చిపెడుతుంది. ఆయుర్వేదం ప్రకారం కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లకు చల్లదనం లభిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ధూళి కణాలు కళ్లలో పడకుండా కాటుక కాపాడుతుంది. అంతేకాదు కళ్లు ఎప్పుడూ తాజాగా, మెరిసేలా చేస్తుంది. కళ్లలో ఏర్పడే ఎర్రటి మచ్చలు కాటుక పెట్టుకోవడం వల్ల తగ్గిపోతాయి. కాటుక తయారీలో కాటుక ప్రమిద, ఆముదం, దూది, రాగి పాత్ర, గంధం, కర్పూరం ఉపయోగిస్తారు.


గతంలో కాటుక అనేది స్త్రీలకున్న సుమంగళ ద్రవ్యములలో ఒకటిగా ఉండేది.. మహిళలు ఐదవతనం కోసం కాటుక పెట్టుకుంటారు. సూర్య కిరణాలు నేరుగా పడటం వలన కంటికి హాని కలుగుతుంది. కాటుక ధరించడం వలన కంటికి చలువ చేస్తుంది. కనుక సూర్య కిరణాలు పడినా కంటికి ఎటువంటి హాని కలుగదు. కాటుక యొక్క మహిమను శ్రావణ మంగళవార నోములో కూడా ప్రత్యేకంగా చెప్పారు
మహిళ సంపూర్ణ ఆయుష్షును కాక తన అత్తమామల కంటిచూపును కూడా మంగళగౌరి అనుగ్రహంతో పొందగలుగుతుంది. అందుకే ఈ వ్రతంలో కాటుక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్రతం చేసిన అమ్మాయ ఇచ్చే వాయనంతోపాటుగా కాటుకను కూడా ముత్తెదువులకి పంచుతుంది. మంగళగౌరీ వ్రతంచేసిన తల్లులకు వైధవ్యబాధలేకుండా నిండు సౌభాగ్యంతో ఉంటారని విశ్వాసం..

కాటుకని ధరించడానికి ముఖ్యమైన కారణం అందం. ప్రకృతిలో మనిషికి మాత్రమే నల్లటి కనుగుడ్డు చుట్టూతా తెల్లటి కంటిభాగం ఉంటుంది. దీనినే స్క్లెరా అంటారు. ఈ తెల్లటి భాగం వలన కనుగుడ్డు ఎటు కదులుతోందో.. మనిషి కళ్లు పలుకుతున్న భావాలు ఏమిటో.. తెలుస్తుంది. ఈ స్క్లెరా చుట్టూ కాటుకని రాయడం వల్ల కళ్లు పలికే భావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకనే భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు చేసేవారు, తప్పకుండా కాటుకను ధరించి తీరతారు.


Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×