OTT Movie : కొత్త బంగారులోకం మూవీతో వెండితెరకు పరిచయమైన వరుణ్ సందేశ్ ఆ తర్వాత పెద్దగా హిట్స్ అందుకోలేక పోయారు. అడపా దడపా చిత్రాలు చేస్తూ దాదాపు కనుమరుగైపోయారు. ఈ సమయంలో బిగ్ బాస్ సీజన్ లో ఎంట్రీ ఇచ్చి, మరో సారి సతీసమేతంగా ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తరువాత తక్కువ బడ్జెట్‌తో, హారర్ ఎలిమెంట్స్ తో రూపొందిన ‘విరాజి’ సినిమా, ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కథ ఒక పాడుబడిన మెంటల్ హాస్పిటల్ లో జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్కరు మిస్టీరియస్ గా చనిపోతుంటారు. ఈ సీన్స్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తాయి. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘విరాజి’ (Viraaji) 2024లో విడుదలైన తెలుగు థ్రిల్లర్ సినిమా. దీన్ని అధ్యంత్ హర్ష డైరెక్ట్ చేశాడు. దీనిని మహేంద్ర నాథ్ కొండ్ల M3 Media బ్యానర్‌లో నిర్మించారు. ఈ సినిమా 2024 ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైంది. 2024 ఆగస్టు 22 నుంచి Aha ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1 గంట 40 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, IMDbలో 7.7/10 రేటింగ్ పొందింది.
ఆండీ (వరుణ్ సందేశ్) అనే వ్యక్తి ఒక ఆసుపత్రిలో కళ్ళు తెరుస్తాడు. అతను అక్కడికి ఎలా వచ్చాడనే విషయం స్పష్టంగా తెలియదు. అతనితో పాటు మరో తొమ్మిది మంది అక్కడ ఉంటారు. కొందరు అక్కడ షూటింగ్ కోసం వచ్చారు. మరికొందరు అనుకోకుండా చిక్కుకున్నారు. ఈ ఆసుపత్రిని గతంలో మానసిక రోగుల చికిత్స కోసం ఉపయోగించారు. కానీ ఇప్పుడు అది శిధిలావస్థలో భయంకరంగా ఉంటుంది. రాత్రి గడిచే కొద్దీ, ఒక మిస్టీరియస్ వ్యక్తి ఆసుపత్రిలోకి ఎంటరవుతాడు. ఈ వ్యక్తి ఎవరనేది స్పష్టంగా తెలియదు. కానీ అతని రాకతో వాతావరణం ఒక్కసారిగా మరింత భయంకరంగా మారుతుంది. ఈ విజిటర్ ఒక సూపర్ నాచురల్ శక్తి కావచ్చనే అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది. అతని రాక తర్వాత, గ్రూప్‌లోని వ్యక్తులు ఒక్కొక్కరూ అనుమానాస్పద రీతిలో చనిపోవడం జరుగుతుంది.
ఆండీ ఈ గందరగోళంలో బతికి బయటపడేందుకు నానాతంటాలు పడతాడు. అతను మిగిలిన వారితో కలిసి ఈ ఆసుపత్రి నుంచి బయటపడే మార్గం కోసం వెతుకుతాడు. ఈ క్రమంలో ఆసుపత్రి గతంలో జరిగిన కొన్ని భయంకర సంఘటనలు బయట పడతాయి. అక్కడ రోగులపై భయంకరమైన ప్రయోగాలు జరిగి ఉంటాయి. ఇప్పుడు ఆసుపత్రిలో జరిగిన గత సంఘటనలకు సంబంధించిన ఒక షాకింగ్ ట్విస్ట్ బయటపడుతుంది. ఈ మిస్టీరియస్ విజిటర్ వాస్తవానికి ఆసుపత్రిలో గతంలో జరిగిన ఒక దారుణమైన సంఘటనకు సంబంధించిన ఒక అతీంద్రియ శక్తి అని తెలుస్తుంది. మరోవైపు ఆండీ తన తెలివితేటలతో, ఈ శక్తిని ఎదుర్కొని, మిగిలిన వారిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఆండీ ఈ రహస్యాన్ని ఛేదించి, బయటపడగలడా? ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఈ మిస్టీరియస్ విజిటర్ ఎవరు? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : ప్రేయసిని వెతుక్కుంటూ వెళ్తే గ్యాంగ్ స్టర్ తగిలాడు… కిక్కెక్కించే మలయాళ లవ్ స్టోరీ