BigTV English
Advertisement

Sunday Mistakes : ఆదివారం ఈ ఐదు తప్పులు చేస్తున్నారా…

Sunday Mistakes : ఆదివారం ఈ ఐదు తప్పులు చేస్తున్నారా…


Sunday Mistakes : వేదాలు, శాస్త్రాలు చెప్పే మాట ఒక్కటే ఏంటంటే ఉదయమే కాసేపు కూర్చోండి. ఉదయం సూర్యుని నుంచి వచ్చే కిరణాలతో డీ విటమిన్ వస్తుందని డాక్టర్లు కూడా చెబుతుంటారు. కాల్షియం లాంటి ఎముక సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి దారి చూపిస్తుంది. సూర్య భగవానుడి కిరణాల ద్వారా శరీరానికి రుగ్మతలు తగ్గిస్తుంది. సైన్స్ కంటే ముందే మన శాస్త్రాలు సూర్య భగవానుడి శక్తి గురించి ఎంతో విపులంగా చెప్పాయి.

సూర్య భగవానుడ్ని ప్రత్యేకంగా పూజించే రోజు ఆదివారం. భూమి మీద ప్రతీ వస్తువుకి, ప్రాణికి గ్రహ సంబంధం ఉందని మన వేదాలు చెప్పాయి. అలాంటి ఈ రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. స్త్రీని సండేరోజు శారీరకంగా కలవకూడదు . కారణం శుక్రుడికి, రవికి పొసగదని శాస్త్రం చెబుతోంది.


ఆదివారం తలకి నూనె రాయకూడదంటారు. శనివారం నూనె రాసుకున్నా ఆదివారం సూర్యాస్తమయంలోగా తలస్నానం చేసేయాలి. ప్రత్యేకంగా ఆదివారం, మంగళవారం తలకి నూనె రాయకూడదు. అలా చేస్తే ఆయుక్షీణం అవుతుందని శాస్త్రం చెబుతున్న మాట. నూనె కారకుడు శని , సూర్యుడు ఆదివారానికి అధిపతి దేవుడు. శనికి రవికి పడదని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఇద్దరూ తండ్రి, కొడుకులే. అలాగే మద్యం కూడా ఆదివారం కూడా తాగకూడదు. మత్తు వల్ల మైకంలోకి వెళ్లిపోయి… మొద్దుగా తయారై బద్దకస్తులుగా మారతారు.. ఆదివారం ఉత్తేజం కావాల్సిన శక్తిని తగ్గించుకోవడమే అవుతుంది. సండే వస్తే నాన్ తెగ తినేస్తారు.కానీ శాస్త్ర ప్రకారం ఈ రోజు మాంసం తినకూడదు. అలా చేయడం వల్ల ఆత్మశక్తి పెరిగి ఆయుష్షు పెరుగుతుంది. ఇవన్నీ పాటించే వారికి భూయోగం కలుగుతుంది

ఆదివారం ఈ నియమాలు పాటించే వారికి వెన్నెముక, ఎముక సంబంధిత వ్యాధులు రావని శాస్త్రం చెబుతోంది. ఈ. ఐదు తప్పులు చేయకుండా ఉంటే దారిద్ర్యం దరి చేరదని శాస్త్రం చెబుతోంది. ఎవరైతే జీవితాలు బాగుండాలని అనుకుంటారో వారు ఈ ఐదు నియమాలు పాటించవచ్చు. ఆదివారం ఉపవాసం చేస్తే శరీరానికి పుష్టి కలుగుతుంది.. ఇవాళ ఎవరైనా తీపి పదార్ధాలు ఇస్తే తినకూడదు.

Related News

Lord Hanuman: హనుమంతుడి నుంచి.. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయాలేంటో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నిత్య దీపారాధన ఎందుకు చేయాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. సోమవారాలు పూజ ఎలా చేయాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. శివుడిని ఎలా పూజిస్తే మంచిది ?

God Idols: ఇలాంటి దేవుళ్ల.. విగ్రహాలు ఇంట్లో అస్సలు ఉంచకూడదు !

Diwali 2025: దీపావళి నాడు ఏమి చేయాలి? లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం ఏంటి ?

Diwali Vastu Tips: దీపావళి రోజు ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. డబ్బే డబ్బు

Diwali 2025: లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే.. పండగ రోజు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి ?

Big Stories

×