BigTV English
Advertisement

Bigg Boss 9 Promo: పచ్చళ్ల పాపకి ఆ మాత్రం కూడా తెలీదా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Bigg Boss 9 Promo: పచ్చళ్ల పాపకి ఆ మాత్రం కూడా తెలీదా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Bigg Boss 9 Promo:మిగతా తెలుగు బిగ్ బాస్ సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సీజన్ 9 కాస్త భిన్నంగా నడుస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈసారి 9 మంది సెలబ్రిటీలు , 6 మంది అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యి కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. మధ్యలో మరొక కామనర్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వగా.. మరొక 6 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇలా ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీ, బుల్లితెర, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇలా భారీగా పాపులారిటీ ఉన్న వారిని హౌస్ లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.


రమ్య మోక్ష అతి.. తామేంటో చూపించిన ఆడియన్స్..

ఒకరకంగా చెప్పాలి అంటే వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆట మరింత రసవత్తరంగా సాగుతోంది. చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పినట్టుగానే ఇందులో టాస్క్ లు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇదిలా ఉండగా 49వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఎలాగో వీకెండ్ వచ్చేసింది. పైగా ఎలిమినేషన్ కూడా.. ఇక సండే ఫన్ డే లో భాగంగా కంటెస్టెంట్స్ చేత నాగార్జున ఆడించిన ఆటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఒక ఎత్తు అయితే.. మరొకవైపు ఎలిమినేషన్ రౌండ్ కూడా అందరినీ సంతోషపరిచింది. ఎలిమినేషన్ అనగానే అందరూ బాధ వ్యక్తం చేస్తారు. కానీ ఈ వీక్ ఎలిమినేషన్ అందరికీ సంతోషాన్ని కలిగించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఎలిమినేషన్ రమ్య మోక్ష… హౌస్ లో అతి చేస్తుందని ఆమెను పంపించడానికి ఆడియన్స్ సిద్ధం అవ్వగా.. ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్లో దానిని చూపించబోతున్నారు. మరొకవైపు టాస్క్ లో భాగంగా పచ్చళ్ళ పాప చేసిన కామెంట్లకు నెటిజన్స్ ఆమెను ఏకీపారేస్తున్నారు.

ఆకట్టుకున్న ప్రోమో..

ప్రోమో విషయానికి వస్తే.. సెలబ్రిటీల ఫోటోలను చూపించి.. వారి వెనుక కొన్ని ఫోటోలను చూపించారు. అయితే ఆ ఫోటోలను బట్టి ఆ సెలబ్రిటీలు ఉన్న పాటలను గెస్ చేయాలి అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున టాస్క్ నిర్వహించారు. ఇక ఇందులో ఎవరికి వారు తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు. ఆ తర్వాత ఇద్దరు కళ్లకు గంతులు కట్టి రుచి చూసి అది ఏ పదార్థమో కనిపెట్టాలి అని తెలిపారు. ఇద్దరు వ్యక్తులకు కళ్లకు గంతలు కడితే ఒకరు ఆ వస్తువును రుచి చూడాలి.. అవతల వ్యక్తి ఆ వస్తువు ఏంటో చెప్పాలి అంటూ టాస్క్ విధించాడు.


ALSO READ:Shahrukh Khan: బర్త్ డే స్పెషల్.. రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న 5 చిత్రాలు.. ఏవి?ఎప్పుడంటే?

రమ్య మోక్షాను ఏకీపారేస్తున్న నెటిజన్స్..

టాస్క్ లో భాగంగా రాము రాథోడ్, రమ్య మోక్ష జంటగా వచ్చారు. వీరిద్దరికి కళ్లకు గంతలు కట్టారు కళ్యాణ్, ఇమ్మానుయేల్. ఇక కళ్యాణ్ రాముకి నిమ్మ కాయను రుచి చూపించాడు. ఇది రుచి చూసిన రాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. పులిహోరలో ఎక్కువగా వాడుతాము అని చెప్పగా.. రమ్య మోక్ష దానికి పోపు అంటూ కామెంట్ చేసింది. నిల్వ ఉంచడానికి ఏం వాడతాం అని అడిగితే నూనె వాడుతామని చెప్పింది. అసలు పులిహోర అనగానే నిమ్మ పండు అని ఎవరైనా సరే వెంటనే గుర్తుపట్టేస్తారు. దీంతో అది కూడా తెలియదా? మరెందుకు పచ్చళ్ల బిజినెస్ చేస్తున్నావ్ అంటూ ఏకంగా ఆమెను ఏకీపారేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ వారం ఎలిమినేట్ అవుతున్న రమ్య ఇటు ఈ విషయం కూడా తెలియక నేటిజన్స్ చేత ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

Related News

Bigg Boss 9 Promo: పాపం సంజన.. వారం మొత్తం భరిస్తుందా?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ నుంచి పచ్చళ్ళ పాప అవుట్.. 2 వారాలకు రెమ్యూనరేషన్..?

Bigg Boss 9: ఇమ్మాన్యుయేల్ గుట్టు రట్టు చేసిన నాగ్.. షాక్ లో తనూజ

Bigg Boss 9: రోడ్ రోలర్.. వీడియోలు చూపించి మరీ వార్నింగ్.. సంజనకి నాగార్జున ఝలక్

Bigg Boss 9: రాము విషయంలో తనూజకు ఫుల్ క్లాస్, వీడియోలతో కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న నాగ్

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ చేయడంలో నాగార్జున ఫెయిల్ అయ్యారా? ఎందుకంత నెగిటివిటీ వస్తుంది?

Duvvada Madhuri: ఒక్క వారంలో ఊహించని మార్పు, అంత తనూజ దయ

Big Stories

×