Diwali 2025: దీపాల పండగ దీపావళి, కాంతి, ఆనందాన్ని మాత్రమే కాకుండా.. సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని ఆహ్వానించే పవిత్ర సందర్భాన్ని కూడా సూచిస్తుంది. హిందూ గ్రంథాల ప్రకారం.. లక్ష్మీదేవి ఈ రోజున భూమిపై తిరుగుతుంది. అంతే కాకుండా స్వచ్ఛత, ప్రేమ, భక్తి, కాంతి కలిసే ఇళ్లలో నివసిస్తుంది. కాబట్టి.. దీపావళి రోజున ముఖ్యంగా శుభప్రదంగా భావించి తప్పకుండా చేయాల్సిన పనులను గురించి తెలుసుకుందాం. ఇవి లక్ష్మీదేవిని సంతోష పెట్టడమే కాకుండా మీ జీవితంలోకి శ్రేయస్సు, అదృష్టాన్ని కూడా తెస్తాయి.
1. స్నానం చేసే ముందు నువ్వులు ఉపయోగించండి:
దీపావళి రోజు ఉదయం నూనెతో స్నానం చేయడం చాలా పుణ్యప్రదంగా చెబుతారు. గ్రంథాల ప్రకారం.. రావి, మామిడి, మర్రి, వంటి పవిత్ర వృక్షాల బెరడును నీటిలో మరిగించి.. ఈ రోజున దానితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
దీపావళి నాడు నీటిలో అమ్మవారు నివసిస్తుందని.. లక్ష్మీ అన్ని నూనెలో కూడా నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి.. నూనెతో అభిషేకం చేసిన తర్వాత స్నానం చేయడం లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడానికి ఒక మార్గంగా మారుతుంది.
2. దీపం వెలిగించండం:
దీపావళి సాయంత్రం.. ప్రదోష కాలంలో.. ముందుగా మీ పూజగదిలో దీపం వెలిగించండి. తర్వాత.. ఇంటిలోని ప్రతి మూల, ప్రాంగణం, బాల్కనీ , ప్రధాన ద్వారాలను కాంతితో నింపండి. ఇంటి ఈశాన్య మూలలో ఒక దీపం, ప్రధాన ద్వారానికి ఇరు వైపులా ఒక దీపం వెలిగించండి. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది. అంతే కాకుండా లక్ష్మీదేవి ప్రవేశించడానికి ద్వారాలను తెరుస్తుంది.
3. అమ్మాయిలను, కుటుంబ సభ్యులను గౌరవించండి:
దీపావళి రోజున ఇంట్లోని పెళ్లికాని అమ్మాయిలను గౌరవించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి స్వయంగా అమ్మాయిలలో నివసిస్తుందని నమ్ముతారు. మీరు వారికి పండ్లు, స్వీట్లు లేదా ఇతర బహుమతులు అందించడం ద్వారా వారి ఆశీర్వాదాలను పొందవచ్చు. అలాగే.. కుటుంబ సభ్యులందరికీ తమలపాకులు ఇవ్వడం, కుంకుమ తిలకం (ప్రేమకు గుర్తు) పూయడం వల్ల పరస్పర ప్రేమ , అదృష్టం పెంపొందుతాయి.
4. బుక్ కీపింగ్, వ్యాపార ఆరాధన:
దీపావళి వ్యాపారులకు, వ్యాపారవేత్తలకు కూడా ప్రత్యేకమైన సమయం. ఈ పండగ రోజు వ్యాపారం చేసే ప్రదేశాలను శుభ్రం చేసి అలంకరించండి. ఇలా చేయడం వల్ల వ్యాపార వృద్ధి, ఆర్థిక స్థిరత్వం నిరంతరం కొనసాగుతాయి.
5. లక్ష్మీ-గణేష్, కుబేరులను పూజించండి:
దీపావళి సాయంత్రం లక్ష్మీదేవి ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున లక్ష్మీదేవితో పాటు, వినాయకుడు, కుబేరుడిని కూడా పూజిస్తారు. లక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు దేవత, గణపతి అడ్డంకులను తొలగించేవాడు. కుబేరుడు సంపదలకు అధిపతి. ఈ మూడు దేవుళ్లను కలిపి పూజించడం వల్ల మీ జీవితంలో సంపద, ఆనందం, అదృష్టం శాశ్వతంగా కలిసి ఉంటాయి.
Also Read: దీపావళి రోజు ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. డబ్బే డబ్బు
6. ఇంటి ప్రధాన ద్వారం అలంకరణ:
లక్ష్మీ దేవిని స్వాగతించడానికి.. ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా, అలంకరించి ఉండాలి. ప్రధాన ద్వారం మీద పిండితో రాసిన స్వస్తిక్, ఓం వేయడం శుభప్రదంగా చెబుతారు. అదనంగా.. తాజా పూల అలంకరణలు, తోరణాలు, రంగోలిలు కూడా ఆకర్షణ, సానుకూల శక్తిని సృష్టిస్తాయి.
7. పవిత్ర స్థలాలలో దీపాలను సమర్పించండి:
వీలైతే.. ప్రదోష కాలంలో ఒక ఆలయంలో.. నది ఒడ్డున లేదా రావి చెట్టు కింద దీపం వెలిగించండి. ఇది పూర్వీకుల, దేవతల ఆశీర్వాదాలను పొందడానికి ఉత్తమ మార్గం.. దీనిని పూర్వీకులకు ప్రార్థనలు చేయడానికి ప్రతీకాత్మక రూపంగా కూడా పరిగణిస్తారు.