Maharashtra News: భార్యాభార్తల మధ్య వివాదాల కారణంగా అన్నెంపుణ్యం తెలియని చిన్నారులు బలవుతున్నారు. చిన్న వయస్సులో ఈ లోకాన్ని విడిచి పెడుతున్నారు. అలాంటి ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. భార్యతో గొడవ పడ్డాడు భర్త. పట్టరాని కోపంతో కవల పిల్లలను కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అసలేం జరిగింది?
భార్యాభర్తల మధ్య గొడవ
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాకి చెందిన రాహుల్ చవాన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిద్దరు కవలలు కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. వారి వయస్సు నాలుగేళ్లు. భార్యభర్తలు అన్న తర్వాత చిన్నచిన్న విషయాల్లో విభేదాలు సహజంగా వస్తుంటాయి. రాహుల్ చవాన్ దంపతుల విషయంలో అదే జరిగింది. సరిగ్గా ఐదురోజుల కిందట భార్యతో వాహనంపై మరో ఊరుకి వెళ్తున్నాడు.
మార్గమధ్యలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి వివాదం మొదలై తారాస్థాయికి చేరింది. ఈలోగా సైలెంట్ అయ్యింది రాహుల్ భార్య. ఈ క్రమంలో తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. వాహనం దిగిపోయి బస్సులో తల్లిదండ్రుల వద్దకు చేరింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న రాహుల్ చవాన్, ఇద్దరు కవలలను వాహనంలో ఓ ఫారెస్టు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడవారిని కత్తితో గొంతు కోసి చంపేశాడు.
కోపంలో చిన్నారుల గొంతు కోసిన తండ్రి
అక్కడి నుంచి తన ఇంటికి వచ్చేశాడు. చేసిన పాపం అనుక్షణం రాహుల్ చవాన్‌ను వెంటాడింది. ఘటన జరిగి నాలుగు రోజుల తర్వాత నేరుగా వాషిమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చేసిన హత్యల గురించి చెప్పి లొంగిపోయాడు. నిందితుడు చెప్పిన విషయాల మేరకు ఓ పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుంది.
ప్రాథమిక పరిశోధనల ప్రకారం.. మృతదేహాలు పాక్షికంగా కాలిపోయాయని, హత్యల తర్వాత ఆధారాలు లేకుండా తగలబెట్టి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పైన జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఏమైనా కారణాలు ఉండొచ్చా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: ప్రేమలో ఓడిపోయాను.. యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో
పిల్లల మరణానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మరణానంతరం పిల్లలను తగలబెట్టాడా? లేక కాలిపోయారా? నిర్ధారణ కోసం పోస్ట్‌మార్టం చేశారు. ఫోరెన్సిక్, శవపరీక్ష ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.