BigTV English

Ashada Masam : ఆషాఢంలో అత్తా కోడలు కలిసి ఉండకూడదా…

Ashada Masam : ఆషాఢంలో అత్తా కోడలు కలిసి ఉండకూడదా…


Ashada Masam : ఆషాఢంలో అత్తా కోడలు కలిసి ఉండకూడదా..


మనపూర్వీకులు ఏ ఆలోచన చేసినా వెనుక ఒక పరామర్ధం ఉంటుంది. భారతీయ సంప్రదాయం పుట్టు పుర్వోత్తరాలు గమనిస్తే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆషాఢ మాసంలో కొత్త జంటలు కలిసి ఉండకూడదన్న నియమం ఉంది. అమ్మాయి నెలతప్పితే కాన్పు జరిగే సమయం మండు వేసవి అవుతుంది. ఆసమయంలో కాన్పు జరిగే మహిళే కాదు జన్మించిన బిడ్డకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పుట్టిన బిడ్డ ఆడయినా మగయినా ఆరోగ్యంగా ఉండాలంటే పుట్ట సమయం కూడా ముఖ్యమైన విషయమనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. వాతావరణం అనుకూలంగా లేకపోతే శరీరంలోని జీర్ణ క్రియ , శ్వాస క్రియ యంత్రాలు సంపూర్ణంగా పటిష్టంగా పనిచేయవు. అందుకే కొత్తగా పెళ్లైన వారు ఆషాఢ మాసంలో ఒక చోట కలిసి ఉండకూడదన్న నియమం పెట్టారు మన పూర్వీకులు. వేసవికాలంలో ప్రసవించిన బిడ్డను ఆ సమయంలో సాకడం కూడా చాలా కష్టమైన విషయమనే చెప్పాలి.

పాత రోజుల్లో వ్యవసాయమే ప్రధానంగా జీవనం సాగించే వారు. ఆషాఢమాసంలో పొలం పనులు ఎక్కువగా ఉంటాయి. తొలకరి జల్లుల నుంచి అరకలు వేస్తూ దున్నడం మొదలు పెడతారు. నాట్లు వేయడం కలుపు తీయడం ఇలాంటివి ఎన్నో పనులు ఉండేవి. కొత్త పెళ్లైన వ్యక్తికి భార్యపై ప్రేమ, వ్యామోహం ఆ సమయంలో ఎక్కువగా ఉంటాయి. వాళ్లిద్దరు ఒక చోటే ఉంటే వ్యవసాయం పనులు చేయడానికి ఆవ్యక్తి బయటకి అవకాశాలు తక్కువ. అందుకే అత్తా కొడలు సంప్రదాయం తీసుకొచ్చారు మన పెద్దలు. కొత్తగా పెళ్లైన జంట ఆషాఢంలో కలిసి ఉండద్దన్న నియమం పెట్టారు. ఆషాడంలో అమ్మాయి అత్తింటికి రావడానికి..అల్లుడు అక్కడికి వెళ్లడానికి వీలులేదని చెప్పారు. కానీ రోజులు మారినా పద్దతులు, పని మారినా కాలాలు మారలేదన్న సంగతి గుర్తించుకోవాలి. పుట్టబోయే శిశువు ఆరోగ్యం దృష్ట్యా ఆషాఢ మాసంలో అమ్మాయి నెలతప్పకుండా ఉంటేనే మంచిదని వైద్యులు చెబుతుంటారు. పుట్టబోయే బిడ్డ సమస్యలు లేకుండా పుట్టాలనే ఎవరైనా కోరుకుంటారు.

అలాగే కొత్త కోడలు పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చినప్పుడు పెళ్ల్లయిన ఆ ఇంటిలో అలవాటుపడటానికి సమయం పడుతుంది. ఆషాఢమాసం నాటికి వాతావరణ మార్పులు కూడా ఇబ్బందులు కలిగిస్తుంటాయి. ముఖ్యంగా వేసవి చివర్లో ఉండే వేడి , మబ్బు వాతావరణం చిరాకు తెచ్చిపెడుతుంది. అసలే కొత్త కోడలు కొత్త ఇల్లు ఈ పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి ఉంటే చిరాకులో ఏదైనా మాట అన్నా గొడవలకి దారి తీసే సందర్భాలు వస్తాయి. కాబట్టే అత్తా కోడలు ఆషాఢంలో ఒక చోట ఉండదన్న నియమం పెట్టడానికి ఒక కారణం.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×