E-Paper
Advertisement

Telangana : చల్లని కబురు.. తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు..

Telangana : చల్లని కబురు.. తెలంగాణలో విస్తరించిన రుతుపవనాలు..
Advertisement

Telangana : తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. గురువారం నాటికి ఖమ్మం వరకు విస్తరించాయి. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల నుంచి ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాల సమీపం వరకు ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం జోరు వానలు పడ్డాయి. శుక్ర, శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక హైదరాబాద్‌లో కూడా వాతావరణం చల్లబడింది. గురువారం చిరు జల్లులు పడ్డాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

తెలంగాణ, హైదరాబాద్​లకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది. ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలతోపాటు హైదరాబాద్​లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. చార్మినార్​, ఖైరతాబాద్​, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, ఎల్​బీ నగర్​, సికింద్రాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అధికారులు చెప్పారు.

రేపు, ఎల్లుండి తక్కువ నుంచి మధ్యస్థ స్థాయిలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రుతపవనాలు విస్తరంచడంతో.. రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. పలు జిల్లాల్లో విత్తనాలు వేయడం మొదలుపెట్టారు. మరో రెండు రోజులు వర్షాలు పడితే పెద్దఎత్తున విత్తనాలు వేసే అవకాశముంది. కనీసం వారం రోజుల పాటు వర్షాలు కురిస్తేనే నార్లు పోస్తామని రైతులు అంటున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×