Film industry:ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో నటీనటులు కావచ్చు.. దర్శక నిర్మాతలు కావచ్చు.. సింగర్స్.. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో లేదా ఇతర కారణాలతో స్వర్గస్తులవుతూ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా మరికొంతమంది అనుమానాస్పద స్థితిలో మరణిస్తూ సరికొత్త అనుమానాలు రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఒకరి మరణం తర్వాత మరొక మరణం అభిమానులు జీర్ణించుకోకముందే మరో షాక్ తగులుతూ ఇండస్ట్రీకి కూడా తీరని లోటును మిగులుస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు క్లాసికల్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న పండిట్ ఛన్నులాల్ మిశ్రా (Chhannulal Mishra)స్వర్గస్తులయ్యారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతోంది. మరి ఈయన మరణం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో సుప్రసిద్ధ గాయకులైన పండిట్ ఛన్నులాల్ మిశ్రా కన్నుమూశారు. ఈయన వయసు ఇప్పుడు 89 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఈయన.. ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో తన కుమార్తె ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు వారణాసిలో జరుగుతాయని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఈయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2010లో పద్మభూషణ్ అవార్డును కూడా ప్రధానం చేసింది. ప్రస్తుతం పండిట్ ఛన్నులాల్ మిశ్రా మరణాన్ని అభిమానులు, సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక గొప్ప సంగీత కళాకారుడిని కోల్పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
పండిట్ చెన్నులాల్ మిశ్రా కెరియర్..
1936 ఆగస్టు 3వ తేదీన హరిహరిపూర్ లో జన్మించారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం పొందిన ఈయన గాయకులు కూడా.. ఈయన తన తండ్రి బద్రీ ప్రసాద్ మిశ్రా వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆ పైన కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ ఘనీ ఖాన్ వద్ద విద్యను అభ్యసించారు . ఆ తర్వాత ఠాగూర్ జయదేవ్ సింగ్ వద్ద కూడా శిక్ష పొందడం గమనార్హం.
పండిట్ ఛన్నులాల్ మిశ్రా అందుకున్న అవార్డులు.
ఈయన బొంబాయి లోని సుర్ సింగర్ సంసద్ నుండి శిరోమణి అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నౌషాద్ అవార్డు, ఉత్తరప్రదేశ్ యష్ భారతి అవార్డు, భారత ప్రభుత్వం చేత సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అవార్డు తో పాటూ.. బీహార్ సంగీత శిరోమణి అవార్డులను సొంతం చేసుకున్నారు. 2017 జనవరి 25న భారతదేశపు అత్యంత మూడవ పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్న ఈయన.. 2020లో భారత దేశపు రెండవ అత్యున్నత పవర్ పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. ఈయన ఎవరో కాదు దివంగత పండిట్ అనోఖేలాల్ మిశ్రా అల్లుడు.