హైదరాబాద్ పరిసరాల్లో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. పురాతనమైనవి, అత్యంత శక్తివంతమైనవి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంది. భక్తులను కోరికలు తీర్చుతూ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతున్నాయి. కొన్ని ఆలయాలు ప్రకృతి అందాల నడుమ అత్యంత అందంగా కనువిందు చేస్తున్నాయి. అక్కడికి వెళ్తే మానసిక ప్రశాంతంతతో పాటు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పొందే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న ఓ అద్భుతమైన జలపాత ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం పేరు శ్రీ గవి సిద్ధేశ్వర ఆలయం. ఇది హైదరాబాద్ నుంచి సుమారు 150 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. తెలంగాణ, కర్నాటక సరిహద్దు జిల్లా అయిన యాదగిరిలోని చింతనహళ్లిలో ఉంటుంది. ఈ ఆలయం అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రెండు కొండల నడుమ జలపాతం పారుతూ ఉంటుంది. ఆ జలపాతంలో నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్తే, గుహ ఉంటుంది. ఆ గుహలో స్వయంభూ శివలింగం కనిపిస్తుంది. నిజానికి ఆలయ ప్రాంగంణంలో కోనేరు ఉన్నప్పటికీ, చాలా మంది గుహలోపల శివలింగాన్ని దర్శించుకునేందుకు వెళ్లే ముందు జలపాతంలో తడుచుకుంటూ వెళ్లాల్సిందే. తడి దుస్తులతోనే శివలింగాన్ని దర్శించుకోవడంతో పాటు పూజల అనంతరం మళ్లీ తడుచుకుంటూ బయటకు వస్తారు.
శ్రీ గవి సిద్ధేశ్వర ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చుట్టూ పచ్చదనంతో నిండిన ప్రకృతి ఒడిలో నెలకొన్న శివలింగం ఎంతో మహిమాత్మకమైనదిగా భక్తులు భావిస్తారు. గుహలో స్వయంగా వెలిసిన ఈ శివలింగం దగ్గర భక్తులు కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు. కర్నాటకలోని హిందూ ఆలయాల్లో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడిప్పుడే కర్నాటక ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది. చింతనహళ్లి వాటర్ ఫాల్స్ సమీపంలో ఉన్న ఈ ఆలయానికి నిత్యం వందలాది భక్తులు తరలి వస్తారు.
?igsh=cWhmOTA4a2p3NWw4
Read Also: జస్ట్ రూ. 22 వేలకే 4 పుణ్యక్షేత్రాల దర్శనం, IRCTC క్రేజీ ప్యాకేజీ!
ఇక హైదరాబాద్ లో ఉండేవారు శ్రీ గవి సిద్ధేశ్వర ఆలయానికి వెళ్లేందుకు వీకెండ్ ప్లాన్ వేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జస్ట్ 150 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్లి రావడానికి కేవలం 5 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఈ ట్రిప్ లో అద్భుతమైన ప్రకృతి అందాలను చూడటంతో పాటు శ్రీ గవి సిద్ధేశ్వర ఆలయంలోని స్వయంభూ శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఎటు చూసినా పచ్చదనం, ప్రకృతి రమణీయతతో కూడిన వాతవరణాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చు. ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ మీ ఫ్రెండ్స్ లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా ఈ ఆలయానికి వెళ్లండి!
Read Also: పాక్ లో నవరాత్రి వేడుకలు, దాండియా ఆటలతో భక్తుల కనువిందు!