Gundeninda GudiGantalu Today episode October 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా, బాలు చింటూను జాగ్రత్తగా చూసుకుంటారు. అప్పుడే రవి శృతి వస్తారు. మీరు వాళ్ళ అత్తకి కాల్ చేయండి అని మీనా చెప్తుంది. ఈ టైంలో తన దగ్గర తన ఫోను ఉండదు అమ్మ మళ్లీ చేసినప్పుడు నీ చేత మాట్లాడిస్తాను అని సుగుణమ్మ అంటుంది. రవి కావాలని రోహిణి పాలను కింద వేయడం చూసి షాక్ అవుతాడు.. రోహిణి పాలు చేజారి కింద పడిపోయాయని అంటుంది. మీనా నేను క్లీన్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది. రవి శృతి లోపలికి వెళ్ళగానే రవి అసలు నిజాన్ని శృతికి చెప్తాడు. రోహిణి అడ్డంగా దొరికిపోతుంది. ప్రభావతి రోహిణిని అడ్డంగా ఇరికిస్తుంది. రోహిణి మనసుతో తెలిసిన బాలు ఇంత ప్లాన్ చేసావా అని ఒక ఆట ఆడుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చింటూ ను చూసిన ప్రభావతి వీడు ఇంకా వెళ్లలేదా అని పెద్ద రచ్చ చేస్తుంది. ఇలాంటి వాళ్లని ఇంట్లో ఉంచాలంటే నాకు చిరాగ్గా ఉంటుంది అని ప్రభావతి అంటుంది. అసలు వాళ్ళ అమ్మ ఎవరో కూడా తెలియదు అసలు ఉందో లేదో కూడా తెలియదు అని ప్రభావతి దారుణంగా మాట్లాడటం విన్న రోహిణి ఆ వాళ్ళ అమ్మ ఎవరో కూడా తెలియదు అసలు ఉందో లేదో కూడా తెలియదు.. చచ్చిందో లేక ఎవరితో అయిన వెళ్లిపోయిందో అని ప్రభావతి అనడం విన్నరోహిని కోపంతో ఆపండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది. చిన్నపిల్లలు ముందు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదా మీకు అని అరుస్తుంది.
ఆ తర్వాత అందుకేనా మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపించి వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపిస్తానని అన్నావ్ అని ప్రభావతి నిజాన్ని బయటపెడుతుంది. ఆ మాట విన్నా బాలు అందుకేనా పాలరమ్మ ఇలాంటి ప్లాన్ చేసింది. ప్రేమగా బిర్యానీ తినిపిస్తూ ఉంటే నేను ఇంకా తల్లి ప్రేమ పొంగు కొచ్చిందేమో అని అనుకున్నాను.. ఇంత ప్లాన్ చేసిందా పాలరమ్మ మనసులో ఎంత ఉందా అని బాలు ఎద్దేవా చేస్తూ మాట్లాడుతాడు. కానీ రోహిణి ఏం చేయమంటావు అత్తయ్య వీళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంది ఎలాగైనా సరే పంపించేయి అని అంటుంది.
ఈమె పోడు భరించలేకే పంపిస్తానని అన్నాను. అని రోహిణి అంటుంది. సుగుణమ్మ బాలు ఇంకొకసారి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకు అని అంటుంది. ఈరోజు చింటూ కట్టలింపుతున్నారు కదా మేము హాస్పిటల్ కి వెళ్తాము అని మీనా పాలు అంటారు. ఇక చింటూ ని తీసుకొని సుగుణమ్మ హాస్పిటల్కి వెళుతుంది. కట్లు విప్పి డాక్టరు చూడమని చెప్తాడు. కానీ చింటూ మా అమ్మ వస్తేనే నువ్వు చూస్తానని అంటుందికానీ చింటూ మా అమ్మ వస్తేనే నువ్వు చూస్తానని అంటాడు..
ఎదురుగా రోహిణి ఉండడం చూసి చింటూ అమ్మ నువ్వు వచ్చావని ఆనందంతో ఉంటాడు.. రోహిణిని చూసినా బాలు నువ్వేంటి పార్లరమ్మ ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు.. నిన్న నేను వచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు బాలు ఎండి గారు ఇవాళ రమ్మని చెప్పారు అందుకే వచ్చాను అని అంటుంది.. ఏంటి రోహిణి నిన్ను చింటూ బాగా మిస్ అవుతున్నాడని అనిపిస్తుంది. బాగా రెండు రోజులు ఉన్నాడు కదా అందుకే అమ్మ అని అంటున్నాడు అని రోహిణి అంటుంది. మరి నువ్వు వెళ్లి అవి ఎవర్నో కలవాలి అన్నావు కదా కలిసేసి వచ్చావా అని బాలు అడుగుతాడు.
Also Read: వేధవతికి క్లాస్ పీకిన రామరాజు.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. భాగ్యం కు మైండ్ బ్లాక్..
కలిసి వచ్చాను ఆయన మీటింగ్ లో ఉన్నారంట కాసేపు ఆగి రమ్మని చెప్పారు. అంతలోపు ఇక్కడ ఉండాలని ఇక్కడికి వచ్చాను అని బాలుతో రోహిణి అంటుంది. ఇక ఇంటికి వెళ్లిన బాలు సత్యం రెడీ అవ్వడం చూసి ఏంటి నాన్న కొత్త పెళ్లికొడుకు లాగా రెడీ అయ్యావు. పిన్ని కోసం వెళ్తున్నావా అని సరదాగా బాలు ఏడిపిస్తాడు. దానికి సత్యం నా పెళ్లి కాదు రా మా కండక్టర్ కూతురు పెళ్లి అందుకే మేము అందరం వెళ్తున్నాము అని అంటాడు. ఇక ప్రభావతి మీరు పెళ్లి చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు చేసుకోండి అని అంటుంది. బాలు ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్లికి పిలవడానికి ఇంటికి వస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మీనా పై ప్రభావతి సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…