Kurnool News: దసరా పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో దేవరగట్టు ప్రాంతం గుర్తుకు వస్తుంది. దసరా రోజు రాత్రి ఆ గ్రామంలో జరిగే కర్రల పోరాటంపై అందరి దృష్టి పడుతుంది. ఈ ఏడాది కర్రల సమరానికి అంతా రెడీ అయ్యింది. దసరా పండుగ రోజు అర్ధరాత్రి జరిగే ఈ సమరానికి పెద్ద చరిత్రే ఉంది.
దేవరగట్టు కర్రల సమయం
ఉమ్మడి కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతంలోని మళ్లేశ్వరస్వామి సన్నిధిలో బన్నీ ఉత్సవం జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు అధికంగా తరలిరానున్నారు. వచ్చే భక్తుల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
అర్ధరాత్రి మాల మల్లేశ్వర స్వామి కళ్యాణ అనంతరం బన్నీ జైత్రయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది యాత్ర ఏలా జరుగుతుందో అన్నా హై టెన్షన్ అప్పుడే మదలైంది. అయితే బన్నీ ఉత్సవాన్ని సంస్కృతి సంప్రదాయబద్దంగా జరుపుకోవాలని పోలీసులు పిలుపు ఇచ్చారు.
పోలీసుల ముందస్తు సూచనలు
దాదాపు 700 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఉత్సవం ముసుగులో ఎవరైనా తలలకు గాయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్సవ సమయంలో చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు ఉండాలని సూచన చేశారు. దేవరగట్టులో ఉత్సవాల్లో అన్నిశాఖల సమన్వయంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు అధికారులు.
ALSO READ: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం
110 సీసీ కెమెరాలు, 10 డ్రోన్ కెమెరాలు, వీటికి ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 20 బెడ్‌లతో తాత్కాలికంగా ఓ ఆసుపత్రి సిద్ధం చేశారు. ఉత్సవంలో గాయాల పాలైనవారికి 104, 108 అంబులెన్స్ వాహనాలు సిద్ధమయ్యాయి. బన్నీ ఉత్సవంలో పరిసర గ్రామాల నుండి లక్షన్నర వరకు భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
200 మంది ట్రబుల్ మాంగర్స్, నాటు సారా అమ్మే వ్యక్తులను బైండోవర్ చేశారు పోలీసులు. అలాగే కార్డన్ సెర్చ్‌లలో నాటు సారా, 340 రింగుల గల కర్రలు సీజ్ చేశారు. దేవరగట్టు పరిసర ప్రాంతాలలో 5 చెక్ పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు. చాలావరకు గాయాలు కాకుండా చూస్తామని అంటున్నారు. బన్నీ ఉత్సవాన్ని సంబరంగా ఆచారించాలని, దీని ముసుగులో దాడులకు తెగబడితే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
స్థల పురాణం మాటేంటి?
పూర్వం దేవరగట్టు కొండ ప్రాంతంలో ఋషులు తపస్సు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. మణి-మల్లాసురుడు అనే ఇద్దరు రాక్షసులు తపస్సు చేసే బుుషులను నిత్యం వేధిస్తూ ఉండేవారు. పరిస్థితి గమనించిన ఋషులు పరమశివునికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్యయంగా ఆ రాక్షసులను వధించి బుషులు, అక్కడి ప్రజలను రక్షించారని స్థల పురాణం చెబుతోంది.
ఈ క్రమంలో అక్కడ వెలిసిన మాల మల్లేశ్వర స్వామి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దసరా పండగ రోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. స్వామి కొండ మీద వెలిసినప్పటికీ కిందికి వచ్చి భక్తుల కోరికలు తీరుస్తారన్నది ఈ ప్రాంత ప్రజల ప్రగాఢ విశ్వాసం.