Intinti Ramayanam Today Episode October 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ అవని ఇద్దరూ కలిసి డబ్బులు తీసుకొని వస్తారు. అక్షయ్ నిపించి అందరి ముందర ఆ డబ్బులని ఇవ్వాలని రాజేంద్రప్రసాద్ అనుకుంటాడు.. అక్షయ్ రాగానే ఆ డబ్బులు ఇచ్చి బిజినెస్ కి ప్లాన్ చేసుకోమని రాజేంద్రప్రసాద్ సలహా ఇస్తాడు. ఈ డబ్బులు నీ ముందు లోపల పెట్టు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే శ్రీయా మాత్రం మీరేం చేసినా అడిగే హక్కు మాకు లేదని అంటున్నారు ఆ మావయ్య అని మళ్ళీ రచ్చ చేస్తుంది. అక్షయ్ ని కూడా శ్రీయా అడుగుతుంది.. ఏం జరిగినా సరే అక్షయ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు. శ్రీయా మాకు డబ్బులు ఇవ్వాలి అని అడుగుతుంది. అందరు చెప్పిన వినదు. మొత్తానికి శ్రీయా నోరు మూయిస్తాడు రాజేంద్ర ప్రసాద్. అక్షయ్ కి డబ్బులు రావడానికి కారణం అవనీని పల్లవి తెలుసుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భరత్ ని చూసిన చక్రధర్ తన ఫ్రెండ్ ని పంపించి డబ్బులు ఇవ్వమని చెప్తాడు. అయితే ఆ డబ్బులను ఇవ్వడానికి చక్రధర్ రాలేదా అని అడుగుతాడు భరత్. ఈ డబ్బులు నీకు ఇచ్చిన తర్వాత ఎవరికీ చెప్పదని ఆయన అన్నారు ఆయన కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు అని ఆ వచ్చిన వ్యక్తి అంటాడు. భరత్ కి ఆ వచ్చిన వ్యక్తి 50 లక్షలు డబ్బులు ఇచ్చి ఈ డబ్బుల గురించి ఎవరి దగ్గర చెప్పొద్దని చెప్పమని అన్నట్లు చెప్తాడు. అలాగే అండి బాబాయ్ గారికి నేను ఎవరికీ చెప్పను అని చెప్పండి అని అంటాడు.
భరత్ కి డబ్బులు ఇచ్చిన విషయాన్ని పల్లవికి చెప్తాడు చక్రధర్. వాడింక రాలేదు డాడ్ వాడి కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని పల్లవి అంటుంది. ప్లాన్లో ఎటువంటి డౌట్ లేదు కచ్చితంగా జరిగిపోతుంది ఆ అవని ఇరుక్కోవడం ఖాయమని పల్లవి అంటుంది. ఇంట్లోకి భరత్ ఎంట్రీ అవ్వడం చూసి పల్లవి మ్యారేజ్ చేసి లోపలికి పంపిస్తుంది. ప్రణతిని కూడా బయటికి పంపించి ఆ డబ్బులని లోపల పెట్టమని అంటుంది.. అయితే భరత్ ఆ డబ్బులని ఎవరికీ తెలియకుండా దాచి పెట్టేస్తాడు. ఎట్టి పరిస్థితులను ఈ డబ్బులు గురించి బయట పెట్టొద్దు అని చెప్తుంది.
శ్రియ అక్షయ్ కి డబ్బులు ఇవ్వడం జీర్ణించుకోలేక పోతుంది. ఎలాగైనా సరే ఇంట్లో పెద్ద రచ్చ చేసి డబ్బులు సాధించాలని అనుకుంటుంది. శ్రీకర్ ని మనము ఇప్పుడు డబ్బులు లేకపోయినా బాగున్నావని అనుకోకుండా మీ నాన్నగారిని ఒక పది లక్షలు డబ్బులు అడగవు అని శ్రీకర్ కి సలహా ఇస్తుంది.. ఇప్పుడు అనవసరంగా డబ్బులు అడగడం ఎందుకు అందరు చేత అనిపించుకోవడం ఎందుకు అని ఎంత చెప్పినా సరే శ్రియ మాట వినదు. ఇవాళ మీ అన్నయ్యకి 50 లక్షలు ఇచ్చారు. రేపు కోటి రూపాయలు ఇవ్వరని గ్యారెంటీ ఏంటి మనం కూడా అడిగి ఎంతో కొంత తీసుకోవాలి అని అంటుంది.
ఇక ఆరాధ్య అక్షయ్ దగ్గరకొచ్చి మీ ఎండి గారు చాలా మంచివారు కాదు నాన్న.. అయితే ఆవిడ దగ్గర జాబ్ మానేస్తే ఆమె ఏమీ అనలేదంటే అందుకు కారణం అమ్మే కదా.. అమ్మ చెప్పడం వల్లే ఆమె ఏమీ అనలేదు కదా అని ఆరాధ్య అంటుంది. నీకోసం అంత చేసిన అమ్మ కోసం నువ్వు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా నాన్న అని ఆరాధ్య అడుగుతుంది. దానికి నేను మీ అమ్మకి మంచి గిఫ్ట్ ఇస్తాను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను కదా ఒక మంచి జాబ్ ఇస్తాను శాలరీ బాగా ఇస్తాను అని అంటాడు. దానికి అవని మీ జాబ్ నాకేం అవసరం లేదు. మీరు మంచిగా బిజినెస్ చేయండి అని ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతుంది.
భరత్ తన దగ్గర ఉన్న డబ్బులని పూజలో పెట్టాలని అనుకుంటాడు. ఆ డబ్బులను చూస్తూ ఉండగా పల్లవి అక్కడికి వస్తుంది.. నువ్వు ఈ డబ్బులు గురించి ఎవరికైనా చెప్తే కచ్చితంగా దొరికిపోతావు ఎవరికి చెప్పకుండా చూసుకో ఎక్స్ట్రాలు చేసావంటే మాత్రం ఈ డబ్బులను నీ దగ్గర నుంచి వాళ్ళు తీసేసుకుంటారు అని పల్లవి వార్నింగ్ ఇస్తుంది. అయితే పల్లవి భరత్ మాట్లాడుకోవడం విన్న ప్రణతి మీరిద్దరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. నీకేమైనా అవసరమైతే పండగకి నన్నే అడుగు నేను అన్నీ చేసిస్తాను అని చెప్తున్నాను అని పల్లవి అంటుంది.
Also Read : రోహిణి పై బాలుకు అనుమానం.. రెండో పెళ్లికి సత్యం రెడీ.. ఫ్రెండ్ ను కలిసిన బాలు..
ఇక ఇంట్లో దసరా కోసం విగ్రహాన్ని తీసుకుని వస్తారు కమల్ భరత్.. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావు కదా అన్నయ్య ఆ డబ్బులన్నీ దేవుడి దగ్గర పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయి నీకు అంత మంచే జరుగుతుందని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చాను నువ్వు కూడా ఈ విగ్రహాన్ని పట్టుకొని అక్కడ పెట్టు అని కమలంటాడు.. ఇక పార్వతి కూడా అవును రా నువ్వు దేవుడి దగ్గర ఆ డబ్బులను పెట్టి పూజ చేస్తే నీకు అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..