BigTV English

Sankranti Celebrations: సంక్రాంతి సంబరంలో గాలి పటాలు తెచ్చే లాభాలు

Sankranti Celebrations: సంక్రాంతి సంబరంలో గాలి పటాలు తెచ్చే లాభాలు

Sankranti Celebrations:హిందూమతంలోనే కాదు భారతీయ సంస్కృతిలో మ‌న ప్ర‌తీ సాంప్ర‌దాయ‌ల వెన‌ుక ఓ ఆరోగ్య ర‌హ‌స్యం ఉంటుంది. అలాగే గాలి పటాలు ఎగరేయాలన్న సంప్రదాయం వెనుక కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. గాలిపటాలను పగలే ఎగరేసేవారు . ఆ సమయంలో అయితే అప్పుడు సూర్య కిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి. శీతాకాలంలో చల్లని గాలికి శరీరానికి ఎక్కువ ఇబ్బందిగా ఉండదు కాబట్టి గాలిపటాలు ఎగరేసేప్పుడు ఎక్కువ సమయం ఉండటంతో శరీరం సూర్య కిరణాలు గ్రహిస్తుంది. దీని వల్ల శరీరానికి, చర్మానికి చాలా ఉపయోగకరం. శరీరంలోని చెడు బాక్టీరియా తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. ఎండలో నిలబడటం వెచ్చని ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వచ్చింది. సంక్రాంతి పండుగ నెల రోజులు ముందు నుంచి ఆకాశంలో గాలిపటాలు ప్రతి ఒక్కరిని కనువిందు చేస్తుంటాయి. తలెత్తి ఎక్కువ సేపు గాలి పటాలు ఎగరేస్తే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.


ఆకాశం నుంచి వాయువు పుడుతుంది. ఆ పుట్టిన వాయువు ఏ దిశగా పుడుతుందో ..ఎంత వేగంగా వీస్తుందో…ఆ కనిపించే గాలిలో ఎంత తేమ ఉందో… ఆ తేమ వల్ల రాబోయే రోజుల్లో ఎంత వర్షం పడే అవకాశాలున్నాయో….ఆ వర్షం వల్ల ఎంత పంట పండటానికి వీలవుతుందో ఇన్ని విషయాలను గాల్లో ఎగిరేసే గాలి పటాలు చెబుతాయి. అంతే కాదు ఆ గాలి పటాలు ఎంత వరకు ఎగురుతూ వెళ్తాయో అంత వరకు ఉత్తరాయణ సూర్యుడా నీకు స్వాగతం చెప్పడానికి సంకేతంగా భావిస్తారు.

ఆధ్యాత్మికపరంగా అయితే 6 నెలల తర్వాత సకల దేవతలు నిద్ర నుంచి మేల్కొంటారని అందుకు సూచనగా ఆకాశంలోకి గాలిపటాలు ఎగురవేస్తూ దేవతలకు కృతజ్ఞతలు తెలిపే మార్గం అని కూడా భావిస్తారు. అయితే గాలి పటాలు ఎగరేసే సంప్రదాయం మన దేశంలోనేకాదు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉంది. మన దగ్గర సంక్రాంతి సమయంలోనే గాలి పటాలు ఆకాశంలో రివ్వు రివ్వు ఎగురుతుంటాయి. ఈ గాలిపటాల ఆచారం ఎలా ఉన్నా..అవి ఎక్కడ నుంచి పుట్టుకొచ్చాయంటే చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.


దాదాపు రూ.2వేల ఏళ్ల కిందట చైనాలో గాలిపటాలను మొదటిసారిగా తయారుచేశారు.. అప్పట్లో గాలిపటాలను ఆత్మరక్షణ కోసం వినియోగించేవారట..అలాగే ఎవరైనా ఏదైన సందేశాన్ని పంపాలంటే గాలిపటాలను వినియోగించేవారు.. అలా మిలటరీ ఆపరేషన్లలో సిగ్నలింగ్ కోసం ఈ గాలిపటాలను వాడుతు వచ్చారు. ఆనాటి గాలిపటాలను పరిశీలిస్తే.. మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఇప్పుడైతే ఎన్నో రకాలు గాలి పటాలు తయారు చేస్తున్నారు. గరుడ పక్షి ఆకారం, ఇలా ఎన్నో రకాలు వచ్చేశాయి.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×