BigTV English

TDP: ఏవీ సుబ్బారెడ్డిపై అటాక్.. లోకేశ్ సాక్షిగా అఖిలప్రియ అనుచరుల వీరంగం..

TDP: ఏవీ సుబ్బారెడ్డిపై అటాక్.. లోకేశ్ సాక్షిగా అఖిలప్రియ అనుచరుల వీరంగం..


TDP: ఆళ్లగడ్డ అగ్గిపిడుగు భూమా అఖిలప్రియ. సొంతపార్టీలోనే ఆమె ప్రధాన శత్రువు ఏవీ సుబ్బారెడ్డి. వారిద్దరి మధ్య వార్.. చాలాకాలంగా నడుస్తోంది. భూమా కుటుంబానికి పదే పదే సవాళ్లు విసురుతూ.. తన ఉనికిని బలంగా చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు ఏవీ సుబ్బారెడ్డి. ఆ ధిక్కారణతో ఆయనపై రగిలిపోతున్నారు భూమా వారసులు.

కట్ చేస్తే, నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో జరుగుతోంది. లోకేశ్‌కు సంఘీభావంగా టీడీపీ నేతలు అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలు తమ అనుచరులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. నిప్పు, ఉప్పు ఒకచోట చేరితే ఏమౌతుంది? అదే జరిగింది.


భూమా అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు. పిడిగుద్దులు గుద్దారు. వెంటనే స్పందించిన ఏవీ అనుచరులు ఆ దాడిని తిప్పికొట్టారు. ఇరువర్గాల పరస్పర దాడులతో నంద్యాలలో రచ్చ రచ్చ జరిగింది.

దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు ఘర్షణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుబ్బారెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

నారా లోకేశ్ సమక్షంలోనే ఏవీ పై దాడి జరగడం, భూమా వర్గీయులు గొడవకు దిగడం, కొట్టుకోవడంతో ఈ ఇష్యూ సీరియస్‌ టర్న్ తీసుకుంది. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో.. అధిష్టానం ఎప్పటిలానే చూసీచూడనట్టు ఉండిపోతుంది. సీమలో ఇలాంటివి కామనే అని లైట్ తీసుకుంటుంది.

అయితే, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య గొడవలు జరుగుతుంటే.. నంద్యాలలో మాత్రం పార్టీలోని రెండు వర్గాలు ఇలా బహిరంగంగా, లోకేశ్ సమక్షంలోనే ఘర్షణ పడటంతో ఈసారి చర్యలు తప్పకుండా ఉంటాయని అంటున్నారు.

Related News

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

AP Council Session: మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం.. బొత్స-లోకేష్ మధ్య ఏం జరిగింది?

Jagan – Pavan: పవన్ జోలికి వెళ్లొద్దు.. జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తున్న వైసీపీ నేతలు

Amaravati News: మొబైల్ పాస్‌పోర్టు సేవలు..భలే ఉంది కదూ, ఇంకెందుకు ఆలస్యం

Bapatla YSRCP: బాపట్లలో వైసీపీకి దిక్కెవరు?

Big Stories

×