E-Paper
Advertisement

Birds Migration : సహకరించని వాతావరణం.. వలసవెళుతున్న పక్షులు..

Birds  Migration : సహకరించని వాతావరణం.. వలసవెళుతున్న పక్షులు..
Advertisement

Birds Migration : చాలావరకు పక్షులు ఒక ప్రాంతాన్ని తమ ఇల్లులాగా భావించి అక్కడే జీవనాన్ని కొనసాగిస్తాయి. అంతే కాకుండా ఒకే దారిలో ప్రయాణిస్తాయి. అది దాటి వేరే ప్రాంతానికి వెళ్లడానికి పక్షులు మొగ్గుచూపవు. కానీ ఈమధ్యకాలంలో చాలావరకు పక్షులు తమ ప్రాంతాలను వీడి, వాటికి అలవాటు లేని ప్రాంతానికి ప్రయాణిస్తాయి. దీనికి కారణమేంటో శాస్త్రవేత్తలు పరిశోధించారు.

మామూలుగా సముద్రపు డేగలు పాసిఫిక్ మహాసముద్రాన్ని దాటి ఎగరవు. కానీ ఈమధ్య అవి పాసిఫిక్‌ను దాటి వేరే ప్రాంతానికి వలస వెళుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. అది ఎందుకో తెలుసుకోవడానికి వారు కొత్త స్టడీని మొదలుపెట్టారు. వాతావరణ మార్పులే దీనికి కారణం అయ్యిండవచ్చన్న వారి అనుమానం నిజమయ్యింది.

Advertisement

గత 60 ఏళ్లలో వాతావరణంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటినుండి పక్షులు వలసవెళ్లడం మొదలుపెట్టాయి. నార్త్ అమెరికా నుండి గత 60 ఏళ్లలో దాదాపు 20 లక్షలకు పైగా పక్షులు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది.

భూమి మ్యగ్నటిక్ ఫీల్డ్‌లో మార్పులు రావడం వల్ల పక్షులు తాము ఎప్పుడూ చూడని ప్రాంతాలకు కూడా వలసవెళుతున్నాయి. ఇలా వలసవెళడం కొన్ని రకాల పక్షులకు మంచి చేసినా.. చాలా ఇతర రకాల పక్షులకు నష్టమే కలిగిస్తుందని శాస్త్రవేత్తలతో పాటు, పర్యావరణవేత్తలు కూడా భావిస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే గానీ ఈ వలసలు ఆగవని వారు అంటున్నారు

Advertisement

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×